మహానటికి సూపర్ వీక్ – ఏమవుతుందో!

Keerthy Suresh Having a Great Week,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Keerthy Suresh Movie Latest News,Pandem Kodi 2 Movie Latest Updates,Actress Keerthy Suresh Movie Release This Week,Keerthy Suresh Movies Detalis,Keerthy Suresh Upcoming Projects News,Keerthy Suresh Sarkar Movie Teaser Release Date
Keerthi Suresh Having a Great Week

ప్రస్తుతం మహానటి..అదేనండి కీర్తి సురేష్ సూపర్ ఫామ్ లో ఉంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీ బిజీ షెడ్యూల్ తో గడిపేస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడు నటించిన సామి చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ ను తెచ్చుకోగా..ఇప్పుడు తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి దసరా బరిలో దిగబోతుంది. పందెంకోడి 2 సినిమాతో అటు తమిళ ప్రేక్షకులతో పాటు…ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా మురిపించడానికి సిద్దమవుతోంది.

మొత్తానికి ఎటు చూసినా ఈ వీక్ మొత్తం కీర్తికి సూపర్ వీక్ గా మారబోతుంది. అదెలాగంటే.. అక్టోబర్ 17 న కీర్తి పుట్టినరోజు..అదే రోజు తను నటించిన పందెంకోడి 2 సినిమా యూఎస్ లో ప్రిమియర్స్ షోస్ ను వేస్తున్నారు. ఆ మరుసటి రోజు అక్టోబర్18న పందెంకోడి 2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఇక అక్టోబర్ 19న సర్కార్ టీజర్ రిలీజ్ అవ్వబోతుంది. దీంతో ఈ వీక్ మొత్తం కీర్తి కి సూపర్ వీక్ గా మారబోతుంది. మరి ట్రైలర్ లో కీర్తి సురేష్ చేసిన యాక్టింగ్ కు అయితే అందరూ ఫిదా అయిపోయారు…మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

కాగా విశాల్ హీరోగా కీర్తి సురేష్,వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=FKN6M_w-X94]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here