అందం-అభినయం- అగ్రస్థానం- పూజా హెగ్డే ప్రోగ్రెస్

Latest Telugu Movies 2018, Pooja Hegde Birthday Celebrations Latest News, Pooja Hegde Birthday Latest News, Pooja Hegde Birthday Special News, Pooja Hegde Birthday with Success, Pooja Hegde Celebrates Birthday with Success, Pooja Hegde Movies Latest News, Pooja Hegde Upcoming Movies Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Pooja Hegde Celebrates Birthday with Success

అందాల పోటీలలో పాల్గొనటం ద్వారా వచ్చిన గుర్తింపును సినిమా అనే గ్లామర్ ప్రపంచంలోకి ఎంటర్ అవటానికి  ఐడీ కార్డులా వాడుకుంటూ ఈ రంగంలో అగ్రస్థానానికి ఎదిగిన అందాల భామలు చాలామంది ఉన్నారు.  అలా అందాల పోటీలలో “మిస్ యూనివర్స్ 2010” లో రన్నరప్ గా నిలిచి ఆ గుర్తింపుతో సినీరంగ ప్రవేశం చేసిన “పూజా హెగ్డే” ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇప్పటివరకు అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ సరైన హిట్ లేకపోవటంతో పూజా హెగ్డే పొజిషన్ పట్ల కొన్ని సందేహాలుండేవి. కానీ అక్టోబర్ 11న విడుదలైన “అరవింద సమేత వీర రాఘవ” అద్భుత విజయం తో  ‘పూజా హెగ్డే‘టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయి కూర్చుంది. అక్టోబర్11న మంచి హిట్ వస్తే.. అక్టోబర్ 13 న అంటే ఈ రోజు అమ్మడి బర్త్ డే వచ్చేసింది. బర్త్ డే కి జస్ట్ రెండు రోజుల ముందు  మంచి హిట్  వస్తే ఆ   ఆనందానికి హద్దులు ఉండవు. ప్రస్తుతం అలాంటి బౌండ్ లెస్ హ్యాపీనెస్ లో తేలిపోతున్న పూజా హెగ్డే ఇటలీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో డ్యూయెట్లు పాడుతుంది.

మహేష్ 25 మహర్షి, ప్రభాస్ 20 చిత్రాలలో ఆమెను హీరోయిన్ గా బుక్  చేయటానికి ముందు ఆమెకు ఇప్పటివరకు సరైన హిట్ లేదు కదా అనే మీమాంస ఉండేది. కానీ ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ తో ఆ సందేహ నివృత్తి జరిగిపోయింది. గ్లామర్- పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి మైనస్ లు లేని పూజ హెగ్డే కు ఇప్పుడు సక్సెస్ కూడా తోడవడంతో ఆమె కెరీర్ చాలా prosperous గా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ  అందాల  ‘బక్క సుందరి’కి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్తూ సరదాగా ఒక చిన్న పోల్ గేమ్  అడుకుందాం.ఇప్పటివరకు పూజా హెగ్డే తెలుగులో నటించిన చిత్రాలు “ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ”. రంగస్థలంలో జిగేలురాణి పాటకు ఐటమ్ గర్ల్ గా చేసింది… కాబట్టి రంగస్థలం ను కన్సిడర్ చేయలేము. సో హీరోయిన్ గా చేసిన 5 సినిమాలలో “అరవింద సమేత వీర రాఘవ ” ను ఈ పోల్ గేమ్ లోకి తీసుకోలేము .. ఎందుకంటే ఆమె తొలి హిట్టు  అదే కాబట్టి సహజంగా అందరూ దానికే ఓటేస్తారు. సో… మిగిలిన నాలుగు సినిమాలలో ఏది టాప్ అన్నదే ఈ పోల్ గేమ్. సినిమాల  జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ నాలుగు సినిమాలలో కూడా పూజ హెగ్డే ముగ్ధమనోహరంగా కనిపించింది. వాటిలో పూజ హెగ్డే మీకు ఏ  సినిమాలో  బాగా ముద్దొచ్చిందో మీ ఓటు ద్వారా చెప్పండి. so.. as useually your voting is your greeting …
thank you for your participation.

 

అందం-అభినయం- అగ్రస్థానం- పూజా హెగ్డే ప్రోగ్రెస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=CzVFdC7YFMc]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here