ప్రభాస్ బర్త్ డే- సాహో నుండి సర్ ప్రైజ్

Saaho Team Special Surprise on Prabhas Birthday,Birthday is Going Bring in Special News for the Audience by Prabhas,Birthday Brings in a Treat for Prabhas Fans,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Prabhas Movie Latest News,Saaho Movie Latest Updates,Prabhas Gives Best Gif For Fans,Prabhas Special Gift For His Fans on His Birthday,Prabhas Movie Saaho Updates
Saaho Team Special Surprise on Prabhas Birthday

సాహో సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా షూటింగ్ ఏడాది క్రితం నుండి జరుపుకుంటుంది. భారీ బడ్జెతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ అయితే వస్తున్నాయి కానీ… ఇంత వరకూ ఈ సినిమా టీజర్ కూడా రాకపోవడంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అభిమానులకు కాస్త ఊరట కలిగే న్యూస్ ఒకటి ప్రకటించింది చిత్ర యూనిట్.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని గ్లింప్స్ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తరువాత, హైదరాబాద్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను ముంబయిలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కొన్ని మార్పులు చెప్పడంతో డైరెక్టర్ ఆపనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=w6lkihp85GA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here