సింగర్ చిన్మయి లిస్ట్ లో క్రికెటర్..

Popular Cricketer Joins Chinmayi Sripaada List of Accused,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Singer Chinmayi Movie Latest News,Singer Chinmayi Sripaada Accused Srilankan Cricketer,Singer Chinmayi Latest Updates,MeToo Movement Latest News
Popular Cricketer Joins Chinmayi Sripaada List of Accused

ఇంతవరకూ హాలీవుడ్ కే పరిమితమైన మీటూ ఉద్యమం ఇప్పుడు మన దేశంలో కూడా ఊపందుకుంది. ఇటీవల అక్కడ అక్కడ దీనిపై చర్చలు జరిగానా…ఒకరిద్దరు సెలబ్రిటీలు దీనిపై నోరు విప్పినా…తాజాగా తను శ్రీ దత్తా తెరపైకి రావడంతో ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తోంది. నానా పటేకర్ పై తను శ్రీ దత్తా ఎప్పుడైతే కామెంట్స్ చేసిందో ఈ వ్యవహారం ఇంకా రచ్చకెక్కింది. ఇక ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు తమకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే.. తమకు ఎదురయ్యాయని లిస్ట్ లో ఒకరి తరువాత ఒకరు చేరిపోతున్నారు. మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.

ఇక నార్త్ లో తనూ శ్రీ దత్తా ది హాట్ టాపిక్ గా మారగా.. సౌత్ లో చిన్నయి శ్రీపాద కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఇటీవల ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌ వేదికగా తమిళ సినీ దిగ్గజం, ప్రముఖ గేయ రచయిత కవిపేరరసు వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. మనవరాలి వయసులో ఉన్న తనను లైంగికంగా వేధించారంటూ వైరముత్తుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో మరో ఊహించని వ్యక్తి పేరు వచ్చి చేరింది. ఆ వ్యక్తి కాదు.. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగ. కొంత మంది మహిళలు తమకు జరిగిన వేధింపుల గురించి డైరెక్ట్ గా చెప్పుకోలేక.. తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అలా ఓ బాధితురాలు తనకు జరిగిన సంఘటనను చిన్నయితో చెప్పుకోగా..ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

అదేంటంటే… మలింగ గురించి చిన్మయికి ఇలా తెలిపింది. కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌ లో తనకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది ఐపీఎల్ సీజన్‌ కావడంతో శ్రీలంక ఫేమస్‌ క్రికెటర్‌ మలింగా కూడా అదే హోటల్లో ఉన్నాడు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే.. ఒకరు ఆమె మలింగా రూంలో ఉందని చెప్పారు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగా మాత్రం నన్ను బెడ్‌ పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. అప్పుడు హోటల్‌ సిబ్బంది డోర్‌ కొట్టారు. దీంతో అతను వెళ్లి డోర్‌ తీశాడు. నేను వెంటనే వాష్‌ రూంకు వెళ్లి నా ఫేస్‌ ను కడుక్కున్నాను. హోటల్‌ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూం నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూంకు వెళ్లావని, అదికాక అతనో ఫేమస్‌ క్రికెటరని, కావాలనే ఇలా చేశావంటారని తెలిపారు’ అని బాధిత యువతి తన గోడును తెలిపినట్లు తెలిపింది చిన్మయి. మరి సెలబ్రిటీల దగ్గర నుండి రాజకీయ నాయకులు, ఇప్పుడు క్రికెటర్ల పేర్లు బయటపడుతున్నాయి. మరి ముందు ముందు ఇంకెంతమంది పేర్లు బయటపడతాయో చూద్దాం. విచిత్రం ఏంటంటే… దీనిపై మలింగా స్పందిస్తాడో లేదో? చూడాలి

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=ZtueX2p2uik]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here