తెలుగు సినీ వెబ్ సైట్స్ చరిత్రలో తొలి ధారావాహిక “స్వర్ణయుగంలో అన్నపూర్ణ”

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website

తెలుగు చలనచిత్రరంగంలో ఆణిముత్యాల్లాంటి అద్భుత చిత్రాలను అందించిన అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ సంస్థలలో “అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థది ఒక విశిష్ట స్థానం. ప్రతి సంస్థకు ఒక ఘన చరిత్ర ఉన్నట్లే అన్నపూర్ణ సంస్థకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సమకాలీన జీవన నేపథ్యాన్ని కథాంశాలుగా తీసుకుంటూ సినిమా అనే శక్తివంతమైన మాధ్యమాన్ని ప్రజలకు అత్యంత చేరువ చేసిన సంస్థలలో “అన్నపూర్ణ” అగ్రగామిగా నిలుస్తుంది.

అన్నపూర్ణ సంస్థ ప్రారంభ చిత్రం “దొంగ రాముడు” మొదలుకొని వరుసగా 12 శతదినోత్సవ చిత్రాలను అందించిన అసాధారణ ఘనత అన్నపూర్ణ సంస్థకే దక్కుతుంది. అన్నపూర్ణ పిక్చర్స్ అంటే చాలామందికి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తన సతీమణి అన్నపూర్ణ పేరు మీద నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో స్ఫురణకు వస్తుంది. కానీ వాస్తవానికి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధం లేదు.

అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే చిత్ర నిర్మాణ సంస్థ 1952 లో ఆవిర్భవించింది. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం 1974-76 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. అయితే ఈ రెండింటిలోనూ కీలక వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు కావటంతో ఆ రెండు ఒకటే అనే భావనలో ఉన్నారు చాలా మంది.

అదలా ఉంచితే ఎన్నెన్నో అపురూప చిత్రాల నెలవుగా కొలువుతీరిన “అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ ఆవిర్భావ పూర్వాపరాలు ఏమిటి? ఆ సంస్థకు అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం ఏమిటి? చిత్ర నిర్మాణం ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అన్నపూర్ణ పిక్చర్స్ ఆదర్శ, అగ్రశ్రేణి సంస్థగా ఎలా ఎదిగింది? – నాటకాలలో ఆడ వేషాలతో నట జీవితాన్ని ప్రారంభించిన అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు? ఆయన ఎదుగుదల, వికాసాల వెనుక దుక్కిపాటి మధుసూదనరావు పాత్ర, ప్రమేయం ఏమిటి? అసలు అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రాలు ఏమిటి? ఈ వివరాలు విశేషాలన్నింటినీ అర్థవంతంగా ఆవిష్కరిస్తూ ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్, సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు ‘ప్రభు’ “ స్వర్ణయుగంలో అన్నపూర్ణ” అనే పుస్తకాన్ని రచించారు.1993 ఆగస్టు 11న నాటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కృతమైన “స్వర్ణయుగంలో అన్నపూర్ణ” పుస్తకం సినీ పాఠకలోకాన్ని విశేషంగా అలరించింది.

ఆపాతమధురాల్లాంటి ఆనాటి విశేషాలను, వివరాలను గా ఆసక్తిగా చదివే పాఠకుల ‘నాస్టోలాజికల్’ ఇంట్రెస్ట్ ను సంతృప్తి పరచగల సమస్త సమాచారం ‘స్వర్ణ యుగంలో అన్నపూర్ణ’ పుస్తకంలో నిక్షిప్తమైఉంది. అలాంటి విలువైన సమాచార విశేషాలను మీకు అందించటం కోసం “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” “స్వర్ణ యుగంలో అన్నపూర్ణ “నవలను సీరియల్ రూపంలో ఇస్తుందని తెలియజేయటానికి సంతోషిస్తున్నాము.

సో…. ఈరోజు నుండి రోజు విడిచి రోజు అంటే ఎవ్వెరి ఆల్టర్నేటివ్ డే స్వర్ణ యుగంలో అన్నపూర్ణ అక్షర ధారావాహికను ద “తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” లో చదవవచ్చు. తెలుగు వెబ్ సైట్స్ చరిత్రలో తొలిసారిగా” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” చేస్తున్న ఈ ప్రయోగం మిమ్ములను అలరిస్తుందని ఆశిస్తున్నాం.

సో.. రేపటినుండి ఫాలో అవ్వండి — అపురూప చిత్రాల “అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” వారి చిత్ర నిర్మాణ జైత్రయాత్రా విశేషాల అక్షర ధారావాహికను…

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=gD0t8Cn-J8U]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here