ఆ విషయంలో ప్రణతిని చూసి స్ఫూర్తి పొందుతున్నా- ఎన్టీఆర్

Jr NTR About Wife Lakshmi Pranathi,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Young Tiger NTR About Wife Lakshmi Pranathi,Jr NTR About Lakshmi Pranathi in Latest Interview,Jr NTR Latest Interview,Aravindha Sametha Movie Updates
Jr NTR About Wife Lakshmi Pranathi

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. తన నటనతో, డైలాగ్స్ తో, డ్యాన్స్ లతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా సరే..సింగిల్ టేక్ లో చెప్పే సత్తా ఉన్న నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆరే. ఈ విషయం ఏ డైరెక్టర్ ని అడిగినా చెబుతారు. తోటి హీరోలు కూడా ఈ విషయంలో ఎలాంటి సందేహం లేకుండా ఎన్టీఆర్ అని టక్కున చెప్పేస్తారు. అలాంటి మెమరీ… వాయిస్ ఉన్న హీరో ఎన్టీఆర్.

ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా ప్రమోషనల్లో ఉన్నసంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. ఇక సెన్సార్ టాక్ కూడా సూపర్ గా రావడంతో సినిమా సూపర్ హిట్ అని అప్పుడే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ తన భార్య ప్రణతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. తన భార్య ప్రణతి వల్లే తాను ఓ విషయంలో స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏ విషయంలో రియలైజ్ అయ్యాడని అనుకుంటున్నారా..?

అదేంటంటే.. జై లవ కుశ సినిమా తరువాత ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగాడట. దాదాపు 85 కేజీల బరువు పెరిగిన తనను చూసి తానే భయపడిపోయాడట. అదే సమయంలో త్రివిక్రమ్ నన్ను ఫిట్ గా ఉండమని చెప్పాడు. అందుకే అరవింద సమేత సినిమాలో రోల్ కోసం చాలా కష్టపడ్డాను. మంచి ట్రైనర్ దొరకడంతో సిక్స్ ప్యాక్ కూడా చేశాను. అప్పుడు అర్ధమైంది ఫిట్ గా ఉండటమంటే ఏంటో అని.. ఫిట్ గా ఉండటం కొన్నేళ్లు మాత్రమే ఉండాల్సింది కాదని.. జీవితాంతం ఉండాల్సిందన్న విషయం అర్దమైందని చెప్పాడు. ఇక తన భార్య గురించి చెబుతూ.. నన్ను చూసి మా ఆవిడ కూడా ప్రెగ్నెన్సీ తరువాత ఫిట్ గా ఉంటోంది.. నీకెందుకు ఇవన్నీ అని అంటే.. నేను కూడా చేస్తా అంటూ పుషప్స్ చేస్తుందని.. తనని చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. మరి అందుకేనేమో అరవింద సమేతలో ఎన్టీఆర్ లుక్ ఫిట్ గా.. చాలా క్లాసీగా ఉంది.

[youtube_video videoid=GEByw76Few0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here