రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టే ప్రభాస్

Prabhas Character in New Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,#Prabhas20 Movie Updates,Prabhas Upcoming Movie News,#Prabhas20,Prabhas New Movie Latest News,Prabhas Role in New Movie,Young Rebel Star Prabhas Next Film Updates
Prabhas Character in New Movie

“ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించదరు”….అంటూ లవకుశ చిత్రంలోని నేపధ్య గీతం ప్రతి మనిషి జీవితానికి వర్తిస్తుంది. నిజానికి ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు…. కానీ ప్రభాస్ చెప్పగలడు.

ఎంటీ.. జోక్ చేస్తున్నారా..? ప్రభాస్ ఏమిటి? భవిష్యవాణి చెప్పడం ఏంటి అనుకుంటున్నారు కదా..? నిజంగా ప్రభాస్ కు ఫ్యూచర్ ముందుగానే తెలిసిపోతుందట… ముందుగా జరగబోయే విషయాలను, ముఖ్యంగా ప్రమాదాలను పసిగట్టి వాటిని తప్పించి జనాలను రక్షించే అతీత శక్తి ఏదో ప్రభాస్ లో ఉందట.
ఏంటి.. అంత శక్తి తనకు ఉంటే తన పెళ్లి ఎప్పుడో చెప్పమనండి చూద్దాం అని అడుగుతున్నారా…? సారీ… అది మాత్రం సాధ్యపడదు… ఎందుకంటే భవిష్యవాణి చెప్పే శక్తి ప్రభాస్ కు నిజ జీవితంలో లేదు…

ప్రస్తుతం గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో ప్రభాస్ పోషిస్తున్న పాత్రకు ఈ అతీత శక్తి ఉందట. ఒక పీరియడ్ ఫిలిం గా రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది.

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణుడు తదితరులు పాల్గొనే కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్టోబర్ 25 వరకు ఇటలీ లో జరుగుతుంది. తెలుగు తమిళ హిందీ భాషలలో త్రిభాషా చిత్రంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం సమకూర్చుతున్నారు. బాహుబలి సిరీస్ కోసం ఐదు సంవత్సరాలు వెచ్చించిన ప్రభాస్ ఇప్పుడు ఏకకాలంలో రెండు చిత్రాలకు పనిచేయటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే అటు సాహో చిత్రానికిగానీ, ఇటు గోపీకృష్ణ మూవీస్ చిత్రానికిగానీ సంబంధించిన ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు… అయితే The most desired bachelor of India గా క్రేజ్ ఉన్న ప్రభాస్ ఈ సినిమాలో భవిష్యవాణి చెప్పినట్లుగానే తన మ్యారేజ్ ఎప్పుడో కూడా చెప్పేస్తే ఎంత బాగుండు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏమో… రానున్న అక్టోబర్ 23 తన బర్త్ డే సందర్భంగా వివాహ మహోత్సవ శుభవార్త ను ప్రకటిస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి… కాబట్టి వేచి చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here