వైజయంతి మూవీస్ బ్యానర్ పై వరుసపెట్టి సినిమాలు.. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో..!

Jr NTR and Vijay Deverakonda Films in Vyjayanthi Movies Banner,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu FIlm Updates 2018,Tollywood Latest News,Vyjayanthi Movies Banner Upcoming Movies,Vyjayanthi Movies Banner Next Film,Vyjayanthi Movies Banner Next Project With Vijay Deverakonda,Vyjayanthi Movies Banner Next Film With Jr NTR
Jr NTR and Vijay Deverakonda Films in Vyjayanthi Movies Banner

మహానటి సినిమా ఘన విజయం తరువాత అశ్వనీదత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. నిజానికి శక్తి సినిమా పరాజయం తరువాత అశ్వనీ దత్ నిర్మాణ రంగానికి కాస్త దూరంగానే ఉన్నారు. అయితే మహానటి సినిమాతో తన కూతుర్లు స్వప్నా దత్, ప్రియాంక దత్ ల పట్టుదలతో మళ్లీ నిర్మాణంలోకి రావడం…ఎక్కడా కాంప్రమైంజ్ కాకుండా.. సినిమాను నిర్మించడం…ఇక సినిమా సూపర్ హిట్టవడం జరిగింది. దీంతో ఇదే ఫామ్ లో వరుసపెట్టి సినిమాలు తీయడానికి రెడీ అయ్యారు అశ్వనీదత్.

ఇప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగార్జున, నాని మల్టీస్టారర్ మూవీ దేవదాస్ తెరకెక్కుతుంది. ఈసినిమా ఈనెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. తమ బ్యానర్ లోనే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు..ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని అశ్వనీ దత్తే చెప్పినట్టు తెలుస్తోంది. సినిమాలకు ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ జరుగుతుందని…ఇవి కాక.. ఇంకా పలు చిత్రాలు ఈ బ్యానర్ లో వస్తాయని తెలుపుతున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఎన్నో హిట్ మూవీస్ తో వెలిగిపోయిన వైజయంతి బ్యానర్ ఇప్పుడు మహానటి సినిమా బూస్ట్ తో మరిన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలు తీయాలని కోరుకుందాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=iXPdcizAGVM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here