ఎందుకో ఏమో రివ్యూ

Enduko Emo Movie Live Updates, Enduko Emo Movie Plus Points, Enduko Emo Movie Public Talk, Enduko Emo Movie Review, Enduko Emo Movie Review and Rating, Enduko Emo Review, Enduko Emo Telugu Movie Public Response, Enduko Emo Telugu Movie Review, Enduko Emo Telugu Movie Story, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Enduko Emo Telugu Movie Review

కోటి వద్దినేని దర్శకత్వంలో నందు,నోయల్‌, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఎందుకో ఏమో. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. మహేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ప్రేక్షకులకు ఎంత నచ్చిందో చూద్దాం..

న‌టీన‌టులుః నందు, నోయ‌ల్, పున‌ర్న‌వి భూపాలం

కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వంఃకోటి వద్దినేని

నిర్మాతః మాలతి వద్దినేని

సంగీతంః ప్రవీణ్‌,

కెమెరాః జియస్‌ రాజ్‌,

ఎడిటింగ్‌ః మధు, ఆర్ట్‌ః వర్మ,

క‌థ :

కార్తిక్ (నందు ) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తూ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఆశపడుతాడు. ఈక్రమంలో హీరో నందు ఉంటున్న ఓ అపార్ట్ మెంట్ లోకి హారిక (పునర్నవి) అద్దెకు దిగుతుంది. మొదటి చూపులోనే తన తో ప్రేమలో పడుతాడు కార్తీక్. నందు ప‌ని చేసే సాఫ్ట్ వేర్ కంపెనీలో త‌ను ఉద్యోగంలో చేరుతుంది.. ఈ క్ర‌మంలో నందు, పునర్న‌వి కి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది . ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఒక చిన్న సంఘటనతో కార్తీక్ ను అపార్థం చేసుకొని అతని మీద కోపం పెంచుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రిన్స్ (నోయల్), కార్తీక్ ఇద్దరు చిన్నప్పటినుండి స్నేహితులు. హారిక ను చూసి తనను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. దానికి కార్తీక్ ను రెచ్చగొట్టి అతనితో ప్రిన్స్ నెలరోజుల్లో హరికను పడగొతానని పందెం కాస్తాడు. అమ్మాయిలు అంతా అలాగే ఉంటారంటూ..నీ ల‌వ‌ర్ ను ల‌వ్ లోకి దించుతానంటూ నందుతో పందెం కాస్తాడు. మ‌రి ఆ పందెంలో ఎవ‌రు గెలిచారు? హీరోయిన్ ఎవ‌రి గురించి వెతుకుతోంది. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్న‌దే చిత్ర క‌థ

విళ్లేష‌ణ :

ట్రై యాంగిల్ లవ్ స్టోరీలూ ఇప్పటికే ఎన్నో వచ్చాయి. కానీ తీసే విధానంలోనే తేడా ఉంటుంది. అలా తనదైన రీతిలో వినూత్నంగా తీసి మంచి మార్కులే కొట్టేశాడు డైరెక్టర్. ద‌ర్శ‌కుడు కోటి వద్దినేనికి ఎందుకో ఏమో చిత్రం తొలి సినిమా అయినా…ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా సినిమాను తెర‌కెక్కించాడు. అనుకున్న క‌థ‌ను తెర కెక్కించ‌డంలో ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. ఆర్టిస్టుల నుంచి మంచి న‌ట‌న రాబ‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక నందు ఎప్ప‌టి లాగే త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. హీరోయిన్ గా పున‌ర్న‌విని న‌ట‌న ప‌ర్వాలేద‌నిపించింది.. ఇక నోయ‌ల్ నెగిటివ్ పాత్ర‌లో నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ప్లే బాయ్ గా, అమ్మాయిల‌ను ట్రాప్ చేసే పాత్ర‌లో నోయ‌ల్ చాలా బాగా ఆక‌ట్టుకున్నాడు. సుడిగాలి సుధీర్ కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. సీనియ‌ర్ న‌టుడు సూర్య ,మిర్చి మాధ‌వి త‌మ పాత్ర‌ల ప‌రిధిలో న‌టించారు .

ప్ల‌స్ పాయింట్స్ :

* ద‌ర్శ‌క‌త్వం
* క‌థ‌, క‌థ‌నాలు
* సంగీతం
* సినిమాటోగ్ర‌ఫీ
* సెకండాఫ్‌

మైన‌స్ పాయింట్స్ః

* ఎడిటింగ్
* ఫ‌స్టాప్ లో లెంగ్త్ సీన్స్

ఈరోజుల్లో అబ్బాయిలు సోషల్ నెట్ వర్క్ ద్వారా అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు..ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనే విషయాన్ని చాలా బాగా చూపించారు. వీటికి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి.. రెండు గంట‌లు ఎక్క‌డా బోర్ కొట్టించకుండా హాయిగా ఎంట‌ర్ టైన్ చేశారు. మొత్తానికి మెసేజ్ విత్ ఎంటర్ టైన్ మెంట్ తో తీసిన `ఎందుకో ఏమో` సినిమా రివేంజ్ డ్రామాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

 

Enduko Emo Telugu Movie Review
  • Story
  • Direction
  • Screenplay
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=pbPMFq1Augw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here