తానాజీ హిందీ సినిమాలో జగపతి బాబు లుక్

#Taanaji, Actor Jagapathi Babu Movies Latest Updates, Jagapathi Babu Look From Ajay Devgn Taanaji, Jagapathi Babu New Film Updates, Jagapathi Babu Upcoming Movie News, Latest Telugu Movies 2018, Telugu Actor Jagapathi Babu Acts Another Languages, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Jagapathi Babu Look From Ajay Devgn Taanaji

టాలెంటెడ్ యాక్టర్ జగపతి బాబు మంచిమనుషులు సినిమాతోబాలనటుడిగా,సింహస్వప్నం సినిమాతో హీరోగా టాలీవుడ్ లో ఎంటరయ్యారు. జగపతి బాబు నటించిన పెద్దరికం,గాయం,శుభలగ్నం,ప్రియరాగాలు,మనోహరం,హనుమాన్ జంక్షన్,పెళ్ళైనకొత్తలో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ సినిమా ఘనవిజయం తో అన్ని భాషల చిత్రాలలోనూ మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. బెస్ట్ యాక్టర్ గా మనోహరం,బెస్ట్ విలన్ గా లెజెండ్ సినిమాలకు నంది అవార్డ్స్ అందుకున్నారు. ప్రస్తుతం అన్ని భాషలతో కలుపుకుని 13 సినిమాలలో నటిస్తున్నట్టు ఒక ఇంటర్వ్యూ లో జగపతి బాబు తెలిపారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా తానాజీ హిందీ సినిమాలో జగపతి బాబు ఒక కీలక పాత్రకు సెలెక్ట్ అయ్యారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తో అనేక యుద్ధాలలో పాల్గొన్న సుబేదార్ తానాజీ గా అజయ్ దేవగన్ నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు టెస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. జగపతి బాబు భయంకర గెటప్ లో ఉన్న స్టిల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సినిమాను అజయ్ దేవగన్ ప్రొడక్షన్స్,వయాకామ్ 18మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=-tj2RXj9MI8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here