#Fasak వీడియోస్ పై స్పందించిన మోహన్ బాబు..

#FasakVideos, Actor Mohan Babu latest Video, Latest Telugu Movies 2018, Mohan Babu About #Fasak Videos, Mohan Babu Latest Interview Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Actor Mohan Babu About #Fasak Videos, Tollywood Cinema Latest News
Mohan Babu About #Fasak Videos

ఫసక్..ఎక్కడో విన్నట్టుంది కదా. ఎక్కడో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఓ ఇంటర్వ్యూలో వాడిన పదం ఇది. నిజంగా ఈ పదం వాడిన మోహన్ బాబు గారు కూడా అనుకోని ఉండరు. ఈ పదం ఇంత ఫేమస్ అవుతుందని. అసలు ఈ ఫసక్ ఏంటీ.. దీనికి మోహన్ బాబు గారికి ఉన్న సంబంధం ఏంటి.. ఆ పదం ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటీ అనుకుంటున్నారా..? దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఇటీవల మోహన్ బాబుగారు ఓ నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ రాజ్ దీప్, మోహన్ బాబు మధ్య ఎం.ధర్మరాజు ఎమ్.ఏ.. సినిమా ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో ఒక డైలాగ్ ను చెప్పమని రాజ్ దీప్ అడగగా.. అందులో తాను తన భార్యనే చంపమనే డైలాగ్ చెప్పి.. దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి చెప్పడానికి ప్రయత్నించారు మోహన్ బాబు గారు. ఈ క్రమంలో ఒక్క దెబ్బతో చంపేయాలి అనే మాటను ఇంగ్లీష్ లోకి అనువదిస్తూ.. ‘‘డోంట్ కిల్ సో మెనీ టైమ్స్ లైక్ దిస్.. ఫసక్’’ అన్నారు. అంతే ఆ ఫసక్ పదమే ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఫేస్ బుక్ లో ట్విట్టర్ రో ఎక్కడ చూసినా ‘ఫసక్‘ .. ‘ఫసక్’ అంటూ రచ్చ రచ్చ చేసేస్తున్నారు. ఈ డైలాగ్స్ పై స్ఫూఫ్స్ చేసి మరీ యూట్యూబ్స్ లో పెడుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ వీడియోలపై మోహన్ బాబుగారే స్పందించారు. ఈ ఫసక్ మీద దాదాపు 200 వీడియోస్ వచ్చాయని…ఈ వీడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయని విష్ణుబాబు నాకు చెప్పాడు..నేనూ కొన్ని వీడియోలు చూశాను..చాలా ఇన్నేవేటివ్ గా..చాలా ఫన్నీగా ఉన్నాయని అన్నారు. నిజానికి మోహన్ బాబు గారు చెప్పడం కాదు కానీ.. ఆ వీడియోలు చూస్తే ఎవరైనా ఫుల్ గా నవ్వుకోవాల్సిందే. మరి మోహన్ బాబు గారు కూడా అనుకోని ఉండరు కదా..ఆ పదం ఇంత ట్రెండింగ్ అవుతుందని…

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=b8LcGVFcZzs]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here