ఆ నాటి పాదయాత్ర సంచలనాన్ని కళ్ళకు కట్టిన “యాత్ర” సాంగ్

Samara Shankham song from yatra brings back memories of YSR padayatra,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Samara Shankham song from yatra Movie,Samara Shankham Lyrical song from yatra,Yatra Telugu Movie Samara Shankam Lyrical Song,Samara Shankam Full Song With lyrics From Yatra Movie,YSR Biopic yatra Movie songs
Samara Shankham song from yatra brings back memories of YSR padayatra

రాజకీయ రంగంలో ఒక చారిత్రక ఘట్టం దివంగత మహానేత డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర. ఆ పాదయాత్ర లోని “యాత్ర“ను టైటిల్ గా పెట్టి డా.రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్ నిర్మాణ కార్యక్రమాలు 90 శాతం పూర్తయ్యాయి.

ఈ ప్రతిష్టాత్మక రాజకీయ చిత్ర నిర్మాణ విశేషాలు ఏవీ ఈ మధ్య కాలంలో బయటకు రాలేదు.అయితే ఆ రాజకీయ దురందరుడు దుర్మరణం పాలైన ఈ రోజున(సెప్టెంబర్-2) ఆయన వర్ధంతి సందర్బంగా ఒక పాటను విడుదల చేసారు చిత్ర నిర్మాతలు.

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాట వింటుంటే ఆ నాటి మహా పాదయాత్ర లో డా.రాజశేఖర రెడ్డి ప్రదర్శించిన సంకల్ప దారుఢ్యం కళ్ళ ముందు కదులుతుంది. “నీ కనులలో కొలిమై రగిలే కలేదో నిజమై తెలవారనీ …వెతికే వెలుగై రానీ ..ఈ నాటి ఈ సుప్రభాత గీతం నీ కిదే అన్నది స్వాగతం”…అనే పల్లవితో ఈ గీతాన్ని ప్రారంభించిన సిరివెన్నెల వారు చరణాలలో అక్షరాల నిప్పులు కురిపించారు. నాటి రాజకీయ రణరంగంలో ఒక్కడిగా, ఒంటరిగా డా.రాజశేఖర రెడ్డి సాగించిన పాదయాత్రా పద ఘటనల ప్రతిధ్వనులు ఈ పాటలో మారుమోగాయి అంటే అతిశయోక్తి కాదు.

కే. సంగీత సారధ్యంలో కాలభైరవ ఈ పాటను పాడారు. ఈ పాట వాస్తవ నేపథ్యంలో ఎంత ఉద్వేగ,ఉద్రేకాలు ఉన్నాయో కాలభైరవ గళంలో అవి అదే గంభీర స్థాయిలో ప్రతిధ్వనించాయి అంటే ఆ క్రెడిట్ సంగీత దర్శకుడు కే. కు దక్కుతుంది.
ఇక కీర్తి శేషులు డా.రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ ని చూస్తుంటే ఒక రెప్లికా ను చూసిన అనుభూతి కలుగుతుంది.మొత్తానికి ఒక దివంగత మహానేత జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న నేపధ్యంలో ఆ చరిత్ర తాలూకు ఔన్నత్యాన్ని దర్శకుడు గుర్తెరిగి ఉండాలి. ఈ సాంగ్ విని,టీజర్ చూస్తే ఈ చిత్ర దర్శకుడు మహీ వీ రాఘవ ఎంత క్లారిటీ తో ఈ సినిమా తీస్తున్నారో అర్ధం అవుతుంది.

క్రియేటివ్ గా ,టెక్నికల్ గా,మేకింగ్ వాల్యూస్ పరంగా “యాత్ర” బయోపిక్స్ లో ఒక సంచలన విజయంగా నిలుస్తుందనటానికి శుభసూచకంగా అనిపిస్తుంది ఈ పాట….దాని విజువల్స్ చూస్తే. మేకా శివ సమర్పణలో విజయ్ చల్లా, శశీ దేవి రెడ్డి ఈ పొలిటికల్ బియోపిక్ ను నిర్మిస్తున్నారు .

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=AGumG8Cs9v4]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here