హిట్లు తక్కువ యావరేజ్ లు ప్లాప్ లు ఎక్కువ.. అయినా ఇమేజ్ హిమాలయాల మీద

Average Over Hits for Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Pawan Kalyan Latest News,Powerstar Pawan Kalyan hit Movies,Pawan Kalyan Best Movies,Pawan Kalyan Blockbuster Movies List,Pawan Kalyan Average Movies List
Average Over Hits for Pawan Kalyan

అన్న చాటు తమ్ముడిగా చిత్ర రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ తనదైన అస్థిత్వాన్ని సంతరించుకోవటానికి ఎక్కువ కాలం పట్టలేదు .మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి” యావరేజ్ గా ఆడినప్పటికి ఆ తరువాత వరుసగా ఆరు విజయాల డబల్ హ్యాట్రిక్ కొట్టేసి అప్పటి యూత్ కు బాగా కనెక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. గోకులంలో సీత,సుస్వాగతం,తొలిప్రేమ, తమ్ముడు,బద్రి,ఖుషీ చిత్రాల వరుస విజయాలతో మోస్ట్ ఏమర్జింగ్ యంగ్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నటించిన 8 వ సినిమా ‘జానీ‘ తో తొలిసారిగా పరాజయాన్ని ఎదుర్కొన్నారు.

ఆ తొలి పరాజయం తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా ప్లాప్ లు,యావరేజ్ లతోనే నెట్టుకు రావలసి వచ్చింది . జానీ తరువాత గుడుంబా శంకర్ ,బాలు,బంగారం,అన్నవరం,జల్సా,కొమరం పులి,తీన్ మార్,పంజా చిత్రాలలో ఏ ఒక్కటి పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను అందుకోలేదు,ఆశలను నెరవేర్చలేదు. అయితే ప్లాప్ లేకపోతే యావరేజ్ ఆర్ ఎబో యావరేజ్ .. అంతే తప్ప ఆకలిగొన్న అభిమానుల విజయ దాహార్తిని చల్లార్చిన సినిమా ఒక్కటీ రాలేదు.అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన “గబ్బర్ సింగ్” పవన్ అభిమానులకు గొప్ప ఊరటనిచ్చింది .

ఆ తరువాత వచ్చిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” బాక్స్ ఆఫీసు లెక్కల ప్రకారం పెద్ద హిట్ కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ కు ఏదో తెలియని కొత్త క్రేజ్ తెచ్చి పెట్టింది .ఇక ఆ తరువాత వచ్చిన “అత్తారింటికి దారేది“అఖండ విజయాన్ని సాధించి పవన్ కెరీర్ లొనే కాకుండా టాలీవుడ్ చరిత్రలోనే కొత్త అధ్యాయాలు సృష్టించింది .ఆ తరువాత పవన్ స్పెషల్ రోల్ చేసిన “గోపాల గోపాల” ఎబో యావరేజ్ గా ఆడింది . ఆ తరువాత మరలా ప్రారంభమైంది ఒక బ్యాడ్ పీరియడ్. “సర్దార్ గబ్బర్ సింగ్,కాటమ రాయుడు చిత్రాలు జస్ట్ యావరేజ్ కాగా ఇక తన కెరీర్ కే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది పవన్ కళ్యాణ్ ఆఖరి చిత్రం “అజ్ఞాతవాసి”.

ఇదీ హీరో గా 23 చిత్రాల పవన్ కళ్యాణ్ ప్రస్థానంలోని జయాపజయాల జమా లెఖ్ఖలు .
మరి ఈ జమా లెక్కల ప్రకారం హిట్లు తక్కువ యావరేజ్ లు,ప్లాపులు ఎక్కువున్న హీరో కు ఇంత ఇమేజ్ ఉండ కూడదే !? మరెందుకు..ఎలా పవన్ కళ్యాణ్ కు ఇంత ఇమేజ్ ,ఇంత ఫాలోయింగ్ ఏర్పడ్డాయి ? పవన్ కళ్యాణ్ ను పొగిడి కొందరు , తిట్టి కొందరు పెద్దోళ్ళైపోతుంటారు …ఎలా ?

ఏ స్టార్ అయితే జయాపజయాలకు అతీతమైన చెరిష్మా ను,ఇమేజ్ ని,రెస్పెక్ట్ ను సంపాదించుకుంటాడో అతనికి సంభందించిన ప్రతి వార్త పతాక శీర్షికే అవుతుంది. అలాంటి క్రెడిబిలిటీ పవన్ కళ్యాణ్ కు ఉంది కాబట్టే సినిమాల జయాపజయాల పేరామీటర్ లో ఆయన క్రేజ్ ను కొలవాలని ప్రయత్నించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్తగా ఒక హిట్ వస్తేనో లేక ఒక ప్లాప్ వస్తేనో పవన్ కళ్యాణ్ కు ఒరిగేది లేదు…పోయేది లేదు.

అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఒక్కటే. 22 ఏళ్ళు- హీరోగా 23 సినిమాలు,అన్నయ్య చిరంజీవి సినిమాల్లో రెండు గెస్ట్ రోల్స్…..అంతేనా …!? కెరీర్ అప్పడే అయిపోయిందా ? అసలు ఇక సినిమాలు చేయను అని ప్రకటించాల్సిన అవసరం,అర్జన్సీ ఏమి వచ్చిపడింది.? రాజకీయాల్లోకి వెళ్ళే సినిమావాళ్ళు సినిమాలకు రాజీనామా చేసి రావాలని ఎవరైనా రూల్స్ పెట్టారా…గేట్లు మూసారా ..!? మరెందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ప్రకటించవలసి వచ్చింది.? సినిమా వాడివైనందుకే కదా ఈ జన నీరాజనం.! సినిమా వాడివైనందుకే కదా ఈ బ్రహ్మరధాలు…ఈ జే జే లు. అలాంటిది సినిమాలు వదిలేస్తేనే జనసేన పార్టీ పెట్టనిస్తాం అని ఎవరో పీకల మీద కత్తి పెట్టినట్లు పవన్ కళ్యాణ్ “చిత్ర సన్యాసం” చేయటం ఎందుకు ? నిజానికి ఇది చాలా మంది అభిమానులను నిరాశపరుస్తున్న నిరర్ధక నిర్ణయం.

ఈ విషయంలో తమ బాధను,అసంతృప్తిని పవన్ కళ్యాణ్ కు ఎలా చెప్పుకోవాలో తెలియక సతమత మౌతున్నారు చాలా మంది అభిమానులు. ఒకవేళ రాజకీయాల్లో అంత బిజీ అయిపోతే కొంత గ్యాప్ తీసుకోవచ్చు గానీ సినిమాల వరకు touch me not అన్నట్లు ప్రకటన చేసి మరీ రిటైర్ అవాల్సిన అవసరం ఏమిటి? అన్నది అభిమానుల మనోగతం. కాబట్టి పావు వంతు కెరీర్ కూడా చూడకుండానే సినిమాల నుండి ఈ అర్ధాంతర అంతర్ధానాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు…కొందరైతే ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నారు.

ఏది ఏమైనా ప్రజల్లో హిమాలయన్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజా హితార్ధమే తప్ప మరే స్వలాభార్జన కోసం రాజకీయ రంగ ప్రవేశం చేయలేదనే విశ్వసనీయత కోట్లాది అభిమానుల్లో ఉంది. ఆ అభిమానం ,విశ్వసనీయత లు అలాగే కొనసాగాలని తన పక్షాన ,తన పాఠకుల పక్షాన పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంది thetelugufilmnagar.com

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=fTZEBd9CWZY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here