మన యువ కథానాయకులలో బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్ ఎవరు ?

Best Dancers in India, Chiranjeevi at No. 10, Jr. NTR at No. 1, Jr. NTR No. 1 And Chiranjeevi at No. 10, Jr. NTR No. 1 Dancer, list of Best Dancers in India, Telugu Filmnagar, tollywood best Dancers, Top 10 Dancers In India, Vote for Best Dancer In Tollywood?
Vote for Best Dancer In Tollywood?

మన నిజ జీవితంలో లేనివి మన సినిమాలలో మస్ట్ అండ్ షూడ్ గా ఉండేవి పాట-ఆట. ఇక్కడ ఆట అంటే క్రీడలు కాదు …డాన్స్ అని అర్ధం. పాటతో పాటే ఆట. అంటే నటుడు అవ్వాలి అంటే నటన ఒక్కటే చాలదు .డాన్సులు,ఫైట్లు వంటి అదనపు విద్యల్లో కూడా ఆరితేరి ఉండాలి. తెరమీద డాన్స్ చేస్తుంటే అలా కళ్ళార్పకుండా చూసేలా ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేయగల డ్యాన్సింగ్ స్టార్స్ మనలో ఎంతమంది ఉన్నారు.?

ఈ విషయాన్ని చర్చించుకునేముందు అసలు మన తెలుగు సినిమాల్లో డాన్స్ అనగానే పాత తరానికి గుర్తువచ్చేది కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వర రావు అయితే అన్ని తరాల కళ్ళ ముందూ కదలాడే వన్ అండ్ ఓన్లీ డ్యాన్సింగ్ డెమో మెగాస్టార్ చిరంజీవి.

ఒక డాన్స్ మాస్టర్ లేదా ఫైట్ మాస్టర్ కంపోజ్ చేసిన మూమెంట్ ను 100 పర్సెంట్ ఇంప్రొవైజేషన్ తో తెరమీద చూపించిన చిరంజీవి తన తరువాత వచ్చిన యంగ్ స్టార్స్ కు డాన్స్ పరంగా ,ఫైట్స్ పరంగా కొన్ని టార్గెట్స్ సెట్ చేశారు. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వటంలో కొంతమంది యంగ్ స్టార్స్ చాలా వరకూ సక్సస్ అయ్యారు…కొంతమంది మాత్రం ఇది మన వల్ల అయ్యే పని కాదులే అని డిసైడ్ అయ్యి ‘మేం చేయగలిగింది ఇంతే ..చూస్తే చూడండి లేకపోతే…మీ ఇష్టం అన్నట్టుగా చేతులెత్తేసిన వారూ ఉన్నారు.

‌ ఏది ఏమైనా మన సినిమాలలో డాన్స్ అనేది ఒక తప్పనిసరి ఐటమ్ అయిన నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల తరువాత తరం యంగ్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరు? అని సరదాగా ఒక పోల్ గేమ్ పెట్టేసుకుని ఓటేసుకుంటే ఎలా ఉంటుందంటారు…! ? ఏంటీ.. ఐటమ్ అదిరింది అంటున్నారా ? ఓ కే ఇంకెందుకు లేటు… మీ అభిమాన డ్యాన్సింగ్ స్టార్ కు వేసేయండి మీ ఓటు. అయితే ఇక్కడ ఒక సెల్ఫ్ కండీషన్ను మీరు పాటించాలి.మీ వ్యక్తిగత అభిమాన తార ఎవరైనా అయి ఉండవచ్చు …కానీ ఓన్లీ డాన్స్ విషయంలో మాత్రం Who is the Best అన్నదే ఈ పోల్ గేమ్ కాబట్టి ఆ కోణంలో think and ink అని రిక్వెస్ట్ చేస్తూ మిమ్ములను ఈ పోల్ గేమ్ కు ఇన్వైట్ చేస్తుంది మీ “తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్”.

మన యువ కథానాయకులలో బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్ ఎవరు ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here