టాప్ టీజర్ ఆఫ్ టాలీవుడ్ అనే పోటీలో మీ ఓటు దేనికి?

Vote for Top Teaser in Tollywood,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Top 10 Telugu Teasers, Top Most Telugu Teaser,Tollywood Top Teaser,Top 10 Telugu Highest Viewed Teasers,South Top 10 Most Viewed Teaser,Most Liked Telugu Teasers,Best Movie Teaser in Tollywood
Vote for Top Teaser in Tollywood

ఒక సినిమా రిలీజ్ అయ్యాక దానిలో ఉన్న దమ్మును బట్టి అది హిట్టో ఫట్టో తేలిపోతుంది.అయితే రిలీజ్ కు ముందే ఒక సినిమా విజయావకాశాలను ప్రభావితం చేసి విజయానికి పీలర్స్ గా ఉపయోగపడే అంశాలు   ప్రధానంగా  రెండు ఉంటాయి. ఒకటి ఆడియో,రెండు టీజర్. ఈ రెండికీ వచ్చే రెస్పాన్స్ ను బట్టి సినిమా రిజల్ట్ ను కొంతవరకూ స్మెల్ చేయవచ్చు. అయితే ఒకోసారి ఆడియో హిట్ అయినా, టీజర్ కు ఎన్ని లక్షల హిట్స్ వచ్చినా రిలీజ్ తరువాత సినిమా బాల్చీ తన్నేయవచ్చు. కాబట్టి ఒక సినిమా ఆడియోకు,టీజర్ కు వచ్చే రెస్పాన్స్ విజయ సూచికగా  ఉపయోగపడ వచ్చేమోగానీ విజయాన్ని నిర్ధారించలేవు. అంటే టీజర్ చూసేసిన వాళ్ళందరూ సినిమా చూసేస్తారన్న నమ్మకం లేదు. రాజకీయ మీటింగులకు వచ్చే వాళ్ళందరూ ఓటేస్తారనుకోవటం ఎంత తప్పో టీజర్ చూసేసిన వాళ్ళందరూ సినిమాకు ఎగబడ తారనుకోవటం అంత తప్పు. అంతే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద రిలీజ్ అయ్యే టీజర్స్ టోటల్ గా నెటీజన్స్ మేటర్.

ఏది ఏమైనా ఏమైనా ఈ రోజుల్లో  టీజర్ రిలీజ్ అన్నది ఒక పెద్ద ఈవెంట్ లాగా మారిపోయింది. అభిమానులకైతే టీజర్ వ్యూస్ కూడా పెద్ద ప్రెస్టీజ్ పాయింట్ అయింది. నెంబర్ ఆఫ్ థియేటర్లు, కలెక్షన్స్, రికార్డులు,ఓపెనింగ్స్ గురించి గొప్పలు చెప్పుకున్నట్లే టీజర్ వ్యూస్ గురించి కూడా అభిమానులు పోటీలు పెట్టుకుంటున్నారు.     తమ  అభిమాన హీరో టీజర్ కు  రిలీజ్ అయిన 24 గంటల్లో ఇన్ని వ్యూస్ వచ్చాయి అంటూ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

అయితే ‘వ్యూస్‘ ఒక్కటే టీజర్ సక్సస్ కు కొలమానం కాదు. టీజర్ అనేది ప్రేక్షకాభిమానులను  టెంప్ట్ చేసేదిగా ఉండాలి. టీజర్ చూడగానే ఏమి కట్ చేసార్రా అనిపించే ఐకానిక్ షాట్స్ కొన్ని ఉండాలి.అలాంటి ఐకానిక్ షాట్ కట్టింగ్ తో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న టీజర్ ఏది? మీ జ్ఞాపకాలలో అలా నిలిచిపోయిన మెమరబుల్ టీజర్ ఏది? అని టాలీవుడ్ టాప్ హీరోల లేటెస్ట్ టీజర్స్ మీ ముందు పెడితే మీ ఓటు ఏ టీజర్ కు వేస్తారు.? సో..వ్యూస్ పరంగానే కాకుండా కంటెంట్ పరంగా కూడా “Top Teaser of Tollywood”అనే ఈ పోల్ గేమ్ లో మీకు నచ్చిన బెస్ట్ టీజర్ ఏదో మీరే సెలెక్ట్ చేయండి.   సినిమాల జయాపజయాలకు,స్టార్ ఇమేజ్ కి సంబంధం లేకుండా కేవలం టీజర్ కంటెంట్ అండ్ క్వాలిటీ మాత్రమే ఈ పోల్ గేమ్ లో మెయిన్ పాయింట్. ఇంకెందుకు ఆలస్యం…. “సెలెక్ట్ ద టాప్ టీజర్ ఆఫ్ టాలీవుడ్”.

టాప్ టీజర్ ఆఫ్ టాలీవుడ్ అనే పోటీలో మీ ఓటు దేనికి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here