ఫార్ములాకు భిన్నంగా కొత్త నేపధ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ “నీవెవరో”

Neevevaro Movie Review,Neevevaro Telugu Movie Review,Tollywood Upcoming Movie News,Latest Telugu Movies 2018,New Telugu Movies,Telugu Movie Reviews 2018,Neevevaro Movie,Neevevaro Movie Rating,Neevevaro Movie Review and Rating,Neevevaro Movie Response,Neevevaro Telugu Movie Rating,Neevevaro Movie Story,Aadhi Pinisetty Neevevaro Review
Neevevaro Movie Review

రెగ్యులర్ లవ్ స్టోరీలు,కుటుంబ కథా చిత్రాలు ,కమర్షియల్ ఫార్ములా చిత్రాలు తీసి తీసి సినిమా వాళ్ళు ,చూసి చూసి జనాలు బోర్ ఫీలవుతున్న నేపథ్యంలో కొత్త కాసెప్ట్ ల తో సినిమాలు తియ్యాలన్న తపన కొందరు దర్శకనిర్మాతలలో కనిపిస్తుంది. అలా ఔట్ ఆఫ్ ద బాక్స్ సినిమా తియ్యాలన్న ప్రయత్నమే ఈ రోజు విడుదలైన “నీవెవరో ” చిత్రంలో కనిపిస్తుంది.

హీరోగా చేసినా,విలన్ గా చేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్ ను,బాడీ లాంగ్వేజ్ ను ,ఇమేజ్ ను డవలప్ చేసుకున్నాడు ఆది పినిశెట్టి.అలాంటి మిక్సిడ్ ఇమేజ్ ఉన్న ఆది పినిశెట్టికి ఎలాంటి కథ షూట్ అవుతుందో అలాంటి టిపికల్ కాన్సెప్ట్ తో హరినాధ్ దర్శకత్వంలో ఎమ్ వీ వీ సత్యనారాయణ నిర్మించిన ‘నీవెవరో’ చిత్రానికి బ్యాగ్రౌండ్ లో ఉండి తెర మీద కథను,తెరవెనుక నిర్మాణ కార్యక్రమాలను నడిపించింది ప్రముఖ రచయిత కోనా వెంకట్. ఇందులో నటించిన నటీనటులు, దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ ,నిర్మాత అందరూ గతంలో సక్సస్ లు చూసిన వాళ్లే అయినప్పటికీ వాళ్ళ వాళ్ళ రీసెంట్ ఫిలిమ్స్ సంతృప్తి కరమైన ఫలితాలు ఇవ్వకపోవడంతో అందరూ హిట్ కొట్టి కెరీర్ ను గాడిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “నీవెవరో ” వాళ్లందరికీ కావలసిన సక్సస్ ను అందించగలదో లేదో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

గుడ్డివాడైన కళ్యాణ్ (ఆది) ఒక చెఫ్. అంధత్వం అవరోధం కాదని నిరూపిస్తూ ఒక రెస్టారెంట్ ను చాలా సమర్ధవంగా నిర్వహిస్తుంటాడు. అతని పొరుగునే ఉండే అను (రితికా సింగ్)కళ్యాణ్ ను ప్రేమిస్తుంది.వాళ్ళిద్దరి తల్లిదండ్రులు కూడా వాళ్లకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు.కానీ కళ్యాణ్ తన రెస్టారెంట్ కు వచ్చే వెన్నెల తో ప్రేమలో పడతాడు.వాలెంటైన్స్ డే రోజున ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఇంతలో ఒక కాల్ మనీ గ్యాంగ్ ఎప్పుడో తన తండ్రి హార్ట్ ఆపరేషన్ కోసం చేసిన 25 లక్షల అప్పు తీర్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నారని చెబుతుంది వెన్నెల.ఆ డబ్బు తాను ఇస్తానని భయపడవద్దని వెన్నెలకు హామీ ఇస్తాడు కళ్యాణ్.కానీ అదే రోజు రాత్రి కళ్యాణ్ కు యాక్సిడెంట్ అవుతుంది.అతను కొలుకునేలోపు వెన్నెల కనిపించకూడాపోతుంది .కానీ ఆ యాక్సిడెంట్ వల్ల ఒక మేలు జరుగుతుంది.యాక్సిడెంట్ తీవ్రత వల్ల కంటి నరాలు రిలాక్స్ అవటంతో ఆపరేషన్ చేసి పుట్టు గుడ్డి అయిన కళ్యాణ్ కు కళ్ళు తెప్పించే అవకాశం ఏర్పడుతుంది .కళ్ళు వచ్చినప్పటినుండి వెన్నెల కోసం తీవ్రంగా అన్వేషిస్తుంటాడు. కానీ ఆమె అడ్రస్ దొరకదు.అసలు ఆమె ఎలా ఉంటుందో కూడా తెలియని కళ్యాణ్ తిరిగి తిరిగి చివరకు తల్లిదండ్రుల వత్తిడి కి తలవంచి అను తో పెళ్లికి అయిష్టంగానే సిద్ధపడతాడు. కానీ ఇంతలో వెన్నెల తండ్రి వచ్చి వెన్నెలకు సంబంధించిన ఒక నిజం చెబుతాడు. ఆ నిజం ఏమిటీ? అసలు వెన్నెల ఇన్నాళ్లు ఏమైపోయింది? ఆ కాల్ మనీ గ్యాంగ్ వెన్నెలను ఏం చేశారు..? కళ్యాణ్ ను అంతగా ప్రేమించిన వెన్నెల హఠాత్తుగా ఎందుకు మాయమైంది ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగుతుతుంది ఈ చిత్ర ద్వితీయార్ధం.

రెగ్యులర్ సెంటిమెంట్స్ అండ్ ఇమోషన్స్ కు భిన్నంగా ఒక క్రైం అండ్ సస్పెన్స్ ఎలిమెంట్ తో సాగే ఈ సినిమాలో ‘అసలు సినిమా ‘స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్ లొనే. ఒక ట్రెడిషనల్ హీరోయిన్ పాత్రకు భిన్నమైన ట్రూలీ డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన తాప్సీ పన్ను ,రెగ్యులర్ హీరోయిజానికి భిన్నమైన లివింగ్ క్యారెక్టర్ చేసిన ఆది ఈ చిత్రంలో పర్ఫార్మెన్స్ పరంగా సెంట్రల్ క్యారెక్టర్స్. నిజంగానే ఇద్దరూ యాక్టింగ్ పరంగా ఇరగదీశారు. ఇక సెకండాఫ్ లో కానిస్టేబుల్ పాత్రలో వచ్చే వెన్నెల కిషోర్ , సెల్ ఫోన్ ట్యాపింగ్ ఎక్సపర్ట్ గా వచ్చే సప్తగిరి ఈ సీరియస్ కంటెంట్ లో కొంత రిలీఫ్ ఇవ్వటానికి ప్రయత్నించారు.రితికా సింగ్ ఒకే. మిగిలినవేవీ చెప్పుకోదగ్గ పాత్రలు కావు.

ఇక దరకత్వం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో ఇంకొంత గ్రిప్పింగ్ గా ఉండిఉంటే బాగుండేది అనే చిన్న ఫీలింగ్ తప్ప మిగిలిన సినిమా మొత్తాన్ని బాగా హ్యాండిల్ చేసాడు యువ దర్శకుడు హరినాధ్.ముఖ్యంగా లాస్ట్ అరగంట మంచి థ్రిల్లింగ్ గా సాగి థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకులకు మంచి లీవింగ్ ఇంపాక్ట్ ఇస్తుంది “నీవెవరో”.

ఇక టెక్నికల్ గా అన్ని శాఖలు సమర్ధవంతంగా పనిచేసి మంచి ఔట్ పుట్ ఇవ్వటంతో ‘నీవెవరో’ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా అలరించే అవకాశాలు ఉన్నాయి.మంచి స్క్రీన్ ప్లే,డైలాగ్స్ ఇవ్వడంతోపాటూ సమర్పకుడి హోదాలో ఈ సినిమాను “ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్” నడిపించిన కోనా వెంకట్ కే ఈ వైవిధ్య చిత్రం తాలూకు రిజల్ట్ క్రెడిట్ దక్కుతుంది.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=SJWhCZ1b6HQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here