రేపు రిలీజ్ అవుతున్నఈ 4 సినిమాలలో ఏది బెస్ట్

What is Your Choice from August 24 Releases?,Latest Telugu Movies 2018,Tollywood Upcoming Movie News,New Telugu Movies,Telugu Movies Releases This Week,Choice from August 24 Releases Telugu Movies,Telugu Movies Upcoming Releases,August 24th Releases in Tollywood
What is your choice from August 24 releases

ఒకే రోజు 4 సినిమాలు విడుదలవుతుంటే ఏ సినిమా బాగుంటుంది? ఏ సినిమా చూడాలి ? అనే డైలమాలో పడతాడు ప్రేక్షకుడు. అయితే క్యాస్టింగ్, ట్రైలర్స్ ,ఆడియో వంటి ప్రీ రిలీజ్ పీలర్స్ ను బట్టి తన ఛాయిస్ ఏమిటో డిసైడ్ అవుతాడు ప్రేక్షకుడు .సో…రేపు అంటే ఆగస్ట్ 24 న రిలీజ్ అవుతున్న 4 సినిమాల వివరాలు ఇప్పుడు మీకు సంక్షిప్తంగా ఇస్తున్నాం.వాటిని బట్టి ఈ నాలుగు సినిమాలలో ఏది ‘చూడబుల్ ‘ అని మీరు అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా మీరే చెప్పండి .సో..ఇప్పుడు వివరాల్లోకి వెళదాం.

1) నారా రోహిత్-జగపతిబాబు-దర్శన్ బానిక్ ప్రధాన పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై నూతన నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్రనాధ్ &కో నిర్మించిన “ఆటగాళ్లు”.

2)ఆది పినిశెట్టి,తాప్సి రితికా సింగ్,వెన్నెల కిషోర్, సప్తగిరి ప్రధాన పాత్రలలో నటించగా హరినాధ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం .వీ .వీ .సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన “నీవెవరో” .

3)జబర్దస్త్ హాట్ గర్ల్ రేష్మీ గౌతమ్ ప్రధాన ఆకర్షణగా ఆమెకు జోడీగా జయ్ అనే యువకుడిని హీరోగా పరిచయం చేస్తూ అజయ్ ఘోష్,మధునందన్ ,హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా జానీ దర్శకత్వంలో నూతన నిర్మాతలు సతీష్,పద్మనాభరెడ్డి,హీరో జయ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “అంతకుమించి”.

4)ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా,బేబీ దిత్యా బాండే ప్రధాన పాత్రలలో ఏ. ఎల్.విజయ్ దర్శకత్వంలో “బిగ్గెస్ట్ డాన్స్ ఫెస్టివల్” అనే క్యాప్షన్ తో వస్తున్న బహుభాషా అనువాద “లక్మీ”.ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ అనువాద చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

సో…రేపు మీ ముందుకు వస్తున్న ఈ 4 సినిమాలలో మీ ఫస్ట్&బెస్ట్ ఛాయిస్ ఏమిటో ఓట్ చేయండి.

ఈ 4 లో మీ ఛాయిస్ ఏమిటి ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here