మెగాస్టార్ నటించిన 7 సందేశాత్మక చిత్రాలలో టాప్ ఏది?

Chiranjeevi Best Message-Oriented Films | Mega Star Chiranjeevi Top 7 Movies Chiranjeevi Best Message-Oriented Films,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Mega Star Chiranjeevi Top 7 Movies,7 Best movies of Chiranjeevi,Message-Oriented Films Of Mega Star Chiranjeevi,Best SevenChiranjeevi Movies,Megastar Chiranjeevi Top Industry Hits,Chranjeevi Hit Movies
Chiranjeevi Best Message-Oriented Films

సాధారణంగా ప్రతి హీరో పాత్రా ఆదర్శప్రాయంగా,సందేశాత్మకoగానే ఉంటుంది.అయితే కేవలం నీతులు,సందేశాలు ఇచ్చుకుంటూపోతే సినిమాలు ఆడవు. సామాజిక విలువలను వ్యాపార విలువలతో మిళితం చేసినప్పుడే సినిమా జనరంజకమౌతుంది.అందుకే మన దర్శకనిర్మాతలు ,హీరోలు ఉభయతరకమైన కథల కోసం అన్వేషిస్తుంటారు.అయితే ఒక దశ దాటిన తరువాత హీరోల స్టార్ ఇమేజ్ వారిని కట్టిపడేస్తుంది.వినోదాన్ని అందించటమే తప్ప విలువల గురించి చర్చించలేని బలమైన మాస్ ఇమేజ్ ఏర్పడటంతో ఉదాత్త పాత్రల ఊసు ఎత్తటానికి కూడా స్టార్స్ వెనుకాడవలసివస్తుంది. ఇలాంటి సందర్భం మెగాస్టార్ చిరంజీవికీ ఎదురయింది. చిరంజీవి అద్భుతమైన ఫార్మ్ తో దూసుకుపోతున్న టైం లో కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో “స్వయంకృషి ” చిత్రం చేయటం ఒక సాహసమే. మరలా అదే ఫార్మ్ లో ఉండగా కె.బాలచందర్ దర్శకత్వంలో”రుద్రవీణ” చేశారు.ఆ తరువాత కొంతకాలం అలాంటి ప్రయోగాల జోలికి పోలేదు.హిట్లర్ కు ముందు అసలు ఎలాంటి కథలూ,పాత్రలు ఎన్నుకోవాలి అనే డైలమాలో పడి ఈ హై య్యస్ట్ పెయిడ్ మెగాస్టార్ 8 నెలలపాటు మొఖానికి రంగు వేసుకోకుండా ఇంటిపట్టున ఉండిపోయారని చాలా మందికి తెలియదు.

హిట్లర్ తరువాత కొన్ని జయాపజయాలు చూసాక మరలా పాత్రల ఎంపికలో సంఘర్షణ స్టార్ట్ అయింది.ఆ సంఘర్షణ నుండి వచ్చినవే ఠాగూర్, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్,స్టాలిన్ అండ్ 150వ చిత్రమైన “ఖైదీ నెంబర్ 150. ఒక వైపు వయసు,మరోవైపు హిమాలయన్ ఇమేజ్ ,ఇంకోవైపు రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయం ఇవన్నీ కలిసి చిరంజీవిని సందేశాత్మక పాత్రలవైపు నడిపించాయి.అయితే వాటిలో కూడా వ్యాపార విలువలు మిస్ అవ్వకుండా more message and less commerce అనే మధ్యేమార్గ పంథాలో కూడా గొప్ప విజయాలను అందుకున్నారు చిరంజీవి.ఈ నేపథ్యంలో చిరంజీవి నాటి ‘స్వయంకృషి’ నుండి నిన్నటి ‘ఖైదీ నెంబర్ 150’ వరకు మొత్తం 7 సందేశాత్మక చిత్రాలు చేశారు.ఆయన కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ను పక్కనపెట్టి ఈ 7 మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలలో మీకు The Best అనిపించిన చిత్రం ఏదో తెలుసుకోవటం కోసం ఈ మెగా పోల్ గేమ్ ను నిర్వహిస్తుంది మీ telugufilmnagar. com.సో …మెగాస్టార్ బర్త్ డే సంధర్భంగా నిర్వహిస్తున్న ఈ పోల్ గేమ్ లో పాల్గొని మీ అభిరుచికి అద్దం పట్టే మీ మెగా పిక్చర్ కు ఓటు వేయండి. your voting is your greeting …కాబట్టి vote and greet  the Mega Star.

మెగాస్టార్ నటించిన 7 సందేశాత్మక చిత్రాలలో టాప్ ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=NMRJTTMMmZw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here