క్రియేటివ్ డైరెక్టర్ “కృష్ణవంశీ” కి జన్మదిన శుభాకాంక్షలు

Birthday Wishes To Director Krishna Vamsi,Latest Telugu Movies 2018,Telugu Filmnagar,Telugu New Movies,Tollywood Upcoming Movie News,Happy Birthday To Director Krishna Vamsi,Creative Director Krishna Vamsi Latest Updates,Director Krishna Vamsi Birthday Special Story,Poll Game,Vote to the Best of Krishna Vamsi
Birthday Wishes To Director Krishna Vamsi

దర్శకులు చాలామంది ఉండవచ్చు…కొంతమంది దర్శకులు పదుల సంఖ్యలో సినిమాలు తీసి ఉండవచ్చు. కానీ దర్శకులు అయిన వాళ్ళందరూ ప్రతిభాసంపన్నులు కాదు…ప్రభావశీలురు కాలేరు.అతి కొద్దిమంది మాత్రమే తమ ప్రతిభా సామర్ధ్యాల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు .అలాంటి మోస్ట్ ఇన్ఫ్లుయన్షియల్ డైరెక్టర్స్ లో కృష్ణవంశీ ఒకరు.సంఖ్యా పరంగా కృష్ణవంశీ ఎక్కువ చిత్రాలు చేయకపోయినా ఒక క్రియేటివ్ డైరెక్టర్ గా తెలుగు సినిమా మీద కృష్ణవంశీ ఇంపాక్ట్ బలంగా ఉంది.

ముఖ్యంగా 90 వ దశకంలో యువ దర్శకులందరికి కృష్ణవంశీ ఒక ఇన్స్పిరేషన్. తెలుగు సినిమా క్రియేటివ్ అండ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ను ఒక హై రేంజ్ కి తీసుకువెళ్లిన దర్శకుల జాబితాలో కృష్ణవంశీ ఫస్ట్ లైనర్ అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. లవ్ ,క్రైమ్,ఫ్యాక్షన్, రివల్ల్యూషన్, ఫ్యామిలీ, ఫాంటసీ, పాట్రియటిక్ ,ఫీల్ గుడ్, మెసేజ్ ఓరియంటెడ్ ….ఇలా అన్ని రన్నింగ్ జోనర్స్ లో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ తీసిన అరుదైన ఘనత కృష్ణవంశీ కి దక్కుతుంది. దర్శకుడిగా రెండున్న ర దశాబ్దాల ప్రస్థానం లో అద్భుత ప్రసంసాపూర్వక విజయాలతో పాటు కొన్ని అనూహ్య అపజయాలు కూడా ఉన్నాయి.జయాపజయాల మిశ్రమంగా సాగిన కృష్ణవంశీ ప్రస్థానం యువ దర్శకులకు ఒక పాఠ్య అంశం .

తీసుకున్న కథాoశం ఏదైనప్పటికి తన సినిమా ద్వారా సొసైటీ కి ఏదైనా మంచి చెప్పాలి అనే కమిట్మెంట్ ను కృష్ణవంశీ ఎప్పుడూ నెగ్లక్ట్ చేయలేదు. గమనించగలిగితే కృష్ణవంశీ ప్రతి సినిమా సృజనాత్మకంగానో, సాంకేతికంగానో ,సందేశాత్మకంగానో ఒక బలమైన ముద్రను ,అడుగు జాడను వదిలినవే .సంప్రదాయ మూస ధోరణి నుండి తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కడానికి ఒక కారకుడిగా,ప్రేరకుడిగా నిలిచిన కృష్ణవంశీ జన్మదినం ఈ రోజు (జులై 28 ) .

జన్మదిన సందర్భంగా ఆ సాయినాధుని దీవెనల కోసం షిరిడీ వెళ్లిన కృష్ణవంశీకి ఇక్కడి నుండే హ్యాపీ బర్త్ డే చెబుతూ తన సినిమాల నుండి ఒక టాప్ టెన్ ఫిలింస్ తీసుకుని సరదాగా ఒక పోల్ గేమ్ ఆడేసుకుందాం .ఒక్కో సినిమా ఒక్కో ఇంపాక్ట్ గా నిలిచిన కృష్ణవంశీ సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో ” ద బెస్ట్ ఆఫ్ కృష్ణవంశీ ” అనే ఈ పోల్ గేమ్ ద్వారా డిసైడ్ చేసేయండి . సో… ఇంకెందుకు ఆలస్యం…your voting is your greeting .

క్రియేటివ్ డైరెక్టర్ “కృష్ణవంశీ” కి జన్మదిన శుభాకాంక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here