అగ్రహీరోలు అందరికి అఖండ విజయాలను ఇచ్చిన బి.గోపాల్ కు హ్యాపీ బర్త్ డే

Birthday Wishes To Director B Gopal, Director B Gopal Birthday Special, B Gopal Blockbuster Movies, B Gopal Movies with Tollywood Top Heroes, Tollywood Director B Gopal Latest News, B Gopal Telugu Hit Movies List, Telugu FilmNagar, Tollywood Film News 2018, Telugu Cinema News 2018, Latest Telugu Movie Updates
Birthday Wishes To Director B Gopal

బి . గోపాల్ …” అప్పీరెన్సెస్ ఆర్ డెసెప్టివ్” అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. ఆ సామెతకు ఖచ్చితంగా సరిపోతుంది డైరెక్టర్ బి.గోపాల్ అప్పీరెన్స్ . ఆయన బ్లాక్ బస్టర్ హిట్స్ కు ఆయన అప్పీరెన్స్ అండ్ బిహేవియర్ కు ఏ మాత్రం పొంతన ఉండదు . చాలా సింపుల్ గా, చాలా డౌన్ టూ ఎర్త్ గా కనిపించే బి.గోపాల్ ను చూస్తే ఈయనేనా ఇన్ని సంచలన విజయాల సూత్రధారి అనిపిస్తుంది.

ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన బి.గోపాల్ అపజయం అన్నది ఎదురవకుండా వరుసగా సూపర్ డూపర్ హిట్స్ సాధించి అతి తక్కువ కాలంలోనే అగ్రశేణి దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. తొలిచిత్రం నుండి వరుసగా 10 కి పైగా ఘన విజయాలను సాధించిన దర్శకుల జాబితాలో దర్శకరత్న దాసరి నారాయణరావు తరువాత స్థానాన్ని దక్కించుకున్న బి.గోపాల్ అగ్ర హీరోలందరికీ అఖండ విజయాలను అందించడంలో కూడా రికార్డు క్రియేట్ చేశారనే చెప్పవచ్చు .

కాంబినేషన్స్ చేయడం చాలామంది దర్శకులు చేస్తారు గాని అందరు హీరోలకు హిట్స్ ఇవ్వగలగటం అందరు దర్శకులకు సాధ్యపడదు .. కానీ తన దర్శకత్వంలో చేసిన దాదాపు అందరు హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన సూపర్ డైరెక్టర్ బి.గోపాల్ మాత్రమే. కృష్ణ‌కు అశ్వ‌త్థామ‌.. చిరంజీవికి స్టేట్ రౌడీ ,ఇంద్ర.. బాలకృష్ణకు లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్ , స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు.. నాగార్జునకు కలెక్టర్ గారి అబ్బాయి.. వెంకటేష్ కు ర‌క్త‌తిల‌కం, బొబ్బిలి రాజా.. మోహన్ బాబు కు అసెంబ్లీ రౌడీ ….. ఇలా అగ్ర తారలందరికి అద్భుత విజయాలను అందించిన బి. గోపాల్ బర్త్ డే ఈ రోజు (జులై 24). అఖండ విజయాలను ఇవ్వడంలోనే కాదు అణుకువ,విజ్ఞత లలో కూడా బి.గోపాల్ ను ఒక ఐడియల్ పర్సన్ గా అభినందించవచ్చు ..ఇంత మంది టాప్ హీరోలకు ఇన్ని హిట్స్ ఇచ్చిన తాలూకు విజయ గర్వం గానీ ,భేషజం గానీ బి.గోపాల్ మాటల్లోనూ , చేతల్లోను మచ్చుకైనా కనిపించవు .

తన విజయాల ద్వారానే కాకుండా తన వివాదరహిత వ్యక్తిత్వం ద్వారాకూడా ది బెస్ట్ అనిపించుకున్న బి.గోపాల్ కు తన తరుఫున తన పాఠకుల తరుఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పలుకుతుంది “తెలుగు ఫిలిం నగర్ .కామ్ ”

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=xSDqCdUf2M8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here