ద బెస్ట్‌ ఆఫ్ ద బ‌ర్త్ డే బోయ్ సూర్య

Best of Suriya, Latest Telugu Movies News, Suriya All Time Hit Movie, Suriya Best Movies, Suriya Latest News, Suriya Next Film Updates, Suriya Next Project Updates, Suriya Upcoming Movie New, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Best of Suriya

జ‌న్మ‌తః త‌మిళ న‌టుడు అయిన‌ప్ప‌టికీ.. అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా అత్యంత చేరువైన న‌టుడు సూర్య‌. నిన్న‌టి త‌రానికి చెందిన ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, ర‌చ‌యిత‌, వ‌క్త అయిన శివ కుమార్ పెద్ద కుమారుడు సూర్య‌. 1975 జూలై 23న జ‌న్మించిన సూర్య‌.. 22 ఏళ్ళ వ‌య‌సులో వ‌సంత్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ణిర‌త్నం నిర్మించిన `నేరుక్కు నేర్` చిత్రం ద్వారా న‌టుడిగా కెరీర్ ప్రారంభించారు. విభిన్న‌ క‌థాంశాల‌తో విశిష్ట పాత్ర‌లు చేయాల‌న్న త‌ప‌న ఉన్న సూర్య‌.. త‌న ఇమేజ్ మీద తానే ప్ర‌యోగాలు చేసుకుని అద్భుత విజ‌యాలను.. అంతులేని ప్ర‌శంస‌ల‌ను.. అందుకు త‌గిన స్థాయిలో అవార్డుల‌ను అందుకున్నారు.

క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాను ఫాలో అవుతూనే.. ప్ర‌యోగాలను స్వాగ‌తించ‌టం ద్వారా సూర్య త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును, గౌర‌వాన్ని సంపాదించుకున్నారు. జ‌న్మ‌తః మంచి అంద‌గాడు అయిన సూర్య త‌ను సాధించిన అద్భుత విజ‌యాల ద్వారానే కాకుండా.. త‌ను పోషించిన విశిష్ట పాత్ర‌ల ద్వారా కూడా గొప్ప స్టార్ డ‌మ్ సాధించారు. త‌న 21 ఏళ్ళ కెరీర్‌లో 35 సినిమాల్లో న‌టించిన సూర్య జ‌న్మ‌దినం ఈ రోజు.

ఈ సంద‌ర్భంగా కేవ‌లం హ్యాపీ బ‌ర్త్‌డే అనేసి వ‌దిలేయ‌కుండా.. సూర్య చిత్రాల మీద స‌ర‌దాగా ఒక చిన్న పోల్ గేమ్ నిర్వ‌హించాల‌ని సంక‌ల్పించింది `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్.కామ్‌`. అందుకే.. సూర్య న‌టించిన‌ చిత్రాల నుండి సూప‌ర్ హిట్ అయిన‌వే కాకుండా.. కొన్ని ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను కూడా ఎంపిక చేసి.. ఆ జాబితాను కింద ఇస్తున్నాం. సో.. `ద బెస్ట్‌ ఆఫ్ ద బ‌ర్త్ డే బోయ్ సూర్య`అనే ఈ పోల్ గేమ్‌లో మీకు బాగా న‌చ్చిన చిత్రాన్ని మీరే ఎంపిక చేస్తే.. సూర్య‌కి హ్యాపీ బ‌ర్త్ డే చెప్పేసిన‌ట్టే. అంటే.. యువ‌ర్ ఓటింగ్ ఈజ్ యువ‌ర్ గ్రీటింగ్‌. సో.. గో ఎహెడ్‌.

ద బెస్ట్‌ ఆఫ్ ద బ‌ర్త్ డే బోయ్ సూర్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here