పోల్‌గేమ్ 10.. ఈ 200 రోజుల్లో.. 20 పాట‌ల్లో.. బెస్ట్ సాంగ్ ఏది?

20 Best Songs of 2018, Latest Telugu Songs 2018, Pilla Raa RX 100 Song, Telugu Film News 2018, Telugu Filmnagar, Telugu Hit Songs List 2018, Telugu Top 20 Hit Songs, Tollywood Movie Updates, Top 20 songs in 200 days, What is your favorite Telugu song of 2018
Top 20 songs in 200 days

పాట‌.. నిజ జీవితంలో లేనిది.. సినిమాలో ఉండి తీరాల్సింది పాట‌. సినిమా విజ‌యాన్ని శాసించేది పాట‌. సినిమాలో ద‌మ్ము లేక‌పోయినా.. కేవ‌లం పాట‌లు హిట్ అయిన కార‌ణంగా.. శ‌త‌దినోత్స‌వాలూ ర‌జ‌తోత్స‌వాలు జ‌రుపుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే.. పాట‌లు లేని సినిమాను ఊహించ‌లేడు స‌గ‌టు భార‌తీయ ప్రేక్ష‌కుడు. పాట‌తో అంత‌గా మ‌మేక‌మై పాటే మంత్రంగా.. పాటే ప్రాణంగా పాట‌ను ప్రేమించే సంగీత ప్రియులు మ‌న‌ ప్రేక్ష‌క‌శ్రోత‌లు. అందుకే.. సినిమా పుట్టిన 80 ఏళ్ళుగా వేలాది సినిమాల్లో ల‌క్ష‌లాది పాట‌లు విన్న ప్రేక్ష‌క శ్రోత‌ల‌కు పాత సినిమాల్లోని పాట‌లు.. `ఆ పాత మ‌ధురాలు`గా, చెర‌గ‌ని జ్ఞాప‌కాలుగా మ‌న‌సు పొర‌ల్లో నిక్షిప్త‌మై ఉంటాయి.

ఇక తాజా సినిమాల పాట‌ల విష‌యానికి వ‌స్తే.. న‌చ్చి మెచ్చిన ప్ర‌తి పాట‌ను సెల్ ఫోన్‌లో రింగ్ టోన్‌గానో, కాల‌ర్ ట్యూన్‌గానో, వేక‌ప్ కాల్‌గానో సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే.. 2018లో గ‌డ‌చిన 200 రోజుల్లో విడుద‌లైన చిత్రాల నుండి 20 సూప‌ర్ హిట్ సాంగ్స్‌ను ఎంపిక చేసి.. వాటిలో మీకు బాగా న‌చ్చిన పాట ఏది? అని పోల్ గేమ్ పెడితే.. మీ ఛాయిస్ ఏమిటి? స‌ంగీత ప్రియులైన మీకు చాలా పాట‌లు న‌చ్చి ఉండ‌వ‌చ్చు.. వాటిలో `ది బెస్ట్‌`గా నిలిచి గెలిచే పాట ఏదో తెలుసుకోవాల‌నే కుతుహ‌లం మీకు ఉంటే.. ` ఈ 200 రోజుల్లో.. 20 పాట‌ల్లో.. బెస్ట్ సాంగ్ ఏది?` అనే పోల్‌గేమ్‌లో పార్టిసిపేట్ చేయ‌మ‌ని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తోంది `తెలుగు ఫిల్మ్‌న‌గ‌ర్‌.కామ్‌`. కింద ఇచ్చిన లిస్ట్‌లో హిట్ అయిన సినిమాలోని పాట‌లే కాదు.. కొన్ని ఫెయిల్డ్ చిత్రాల్లోని హిట్ పాట‌ల‌ను కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. సినిమా ఫెయిల్ అయినా.. పాట పాపుల‌ర్ అయిన‌ప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయ‌లేము క‌దా.. సో. . ఇది పాట‌ల గురించిన పోటీ కాబట్టి.. సినిమా జ‌యాపజ‌యాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా.. కేవ‌లం పాట విజ‌యాన్నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని తెలియ‌జేస్తూ వుయ్‌ వెల్‌క‌మ్ యు టు దిస్ పోల్ గేమ్‌..

ఈ 200 రోజుల్లో.. 20 పాట‌ల్లో.. బెస్ట్ సాంగ్ ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=HjGL4t5nGHk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here