ఈ వారం నాలుగు సినిమాల్లో నా ఛాయిస్

Aatagadharaa Siva Latest Movie 2018 Update, Manchu Lakshmi W/O Ram Movie News, Parichayam Telugu Movie 2018 Latest News, Poll:Which of these do you prefer to watch this weekend?, Raj Tarun Lover Movie Update, Telugu Cinema News, Telugu Filmnagar, This week releases in Tollywood, This Weekend Telugu Releases, Tollywood Latest Updates, Upcoming Telugu Movies 2018
ఈ వారం నాలుగు సినిమాల్లో నా ఛాయిస్

ఒకే వారంలో నెంబ‌రాఫ్ ఫిల్మ్స్ రిలీజైతే.. ఏ సినిమా చూడాలనే మీమాంస ప్రేక్ష‌కుల్లో ఏర్ప‌డుతుంది. ఆప్ష‌న్స్ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడే సెల‌క్ష‌న్‌లో వేవ‌రింగ్ ఎక్కువ‌వుతుంది. న‌టీన‌ట‌వ‌ర్గం, బ్యాన‌ర్‌, డైరెక్ట‌ర్‌, ప‌బ్లిసిటీ అనే నాలుగు అంశాల ఆధారంగా ప్రేక్ష‌కుడు ఏ సినిమా చూడాలి అనే విష‌యాన్ని డిసైడ్ అవుతాడు. న‌చ్చితే అన్నింటిని ఆద‌రిస్తాడు. న‌చ్చ‌క‌పోతే అన్నింటిని ఈడ్చి కొడ‌తాడు. అందుకే.. ‘What is his first and best choice’ అనేది చాలా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌గా మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ జూలై మూడ‌వ‌ వారంలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ నాలుగింటిలో ప్రేక్ష‌కుడు దేన్ని త‌న `ఫ‌స్ట్ బెస్ట్ ఛాయిస్‌`గా ఎంచుకుంటాడు అన్న‌దే ఆయా సినిమాల విజ‌యానికి పునాది అవుతుంది. కాగా.. ఈ నేప‌థ్యంలో ఈ వారం విడుద‌ల కానున్న సినిమాల వివ‌రాలేంటో ఒక సారి చూద్దాం.

1. రాజ్ త‌రుణ్ హీరోగా దిల్ రాజు బ్యాన‌ర్ నుండి నూత‌న ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ల‌వ‌ర్` జూలై 20న విడుద‌ల‌వుతుంది.
2. విజ‌య్ ఏల‌కంటిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ – మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన‌ సినిమా `వైఫ్ ఆఫ్ రామ్‌`. మంచు ల‌క్ష్మీ టైటిల్ రోల్ పోషించిన‌ ఈ సినిమా కూడా జూలై 20న రిలీజ్ కాబోతోంది.
3. `ఆ న‌లుగురు`, `మ‌ధుమాసం`, `అంద‌రి బంధువ‌యా` వంటి ఫీల్ గుడ్ చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర సిద్ధార్థ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేష్ నిర్మించిన `ఆట‌గ‌ద‌రా శివ` కూడా జూలై 20న రిలీజ్ కానుంది. ఇందులో క‌న్న‌డ న‌టుడు దొడ్డ‌న్న‌, `జ‌బ‌ర్ద‌స్త్` ఫేమ్ హైప‌ర్ ఆది ప్ర‌ధాన పాత్ర‌ధారులు.
4. విరాట్ కొండూరి, సిమ్ర‌త్ కౌర్‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ ల‌క్ష్మీ కాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `ప‌రిచ‌యం`.. జూలై 21న విడుద‌ల‌వుతోంది.

ఇవీ.. సంక్షిప్తంగా జూలై 3 వ వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నాలుగు సినిమాల వివ‌రాలు. ఈ నాలుగు సినిమాల్లో మీ ఛాయిస్ ఏమిటో.. ఓట్ చేయండి అని ఆహ్వానిస్తూ `ఈ వారం నాలుగులో నా ఛాయిస్` అనే పోల్ గేమ్‌కు ఇన్వైట్ చేస్తోంది `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్. కామ్‌`. సో.. ప్లీజ్ ఓట్ ఆన్ యువ‌ర్ ఛాయిస్‌.

ఈ వారం నాలుగు సినిమాల్లో నా ఛాయిస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=CrP6hveoBXg]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here