2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ డైరెక్ట‌ర్‌

2018 Tollywood Best Director in First Half, Best Director 2018 Predictions, Best Director in First Half of 2018, Best Telugu Film Directors, Latest Telugu Movies News, Poll Game, Telugu Cinema News 2018, Telugu Filmnagar, Tollywood Best Director in First Half Of 2018, Tollywood Film News, Vote For Tollywood Best Director 2018
Best Director in the First Half of 2018

ద‌ర్శ‌కుడు.. సినిమాని ముందుగా త‌న మ‌నో నేత్రంతో ద‌ర్శించే వాడే ద‌ర్శకుడు. 24 ఫ్రేమ్‌ల‌, 24 శాఖ‌ల ఇంద్ర‌జాల‌మైన సినిమాలో అన్ని శాఖ‌ల్లోనూ ప్రావీణ్యం లేక‌పోయినా.. ఆయా శాఖ‌ల ప‌నితీరు మీద ప‌ట్టు, అవ‌గాహ‌న ఉండాలి ద‌ర్శ‌కుడికి. మ‌నం తెర మీద చూసే న‌టీన‌టుల హావ‌భావాల‌ను, సంగీత‌, సాహిత్య‌, సాంకేతికాది విష‌యాల‌న్నింటిని నిర్దేశించి ఎగ్జిక్యూట్ చేసే `కెప్టెన్ ఆఫ్ ది షిప్` ద‌ర్శ‌కుడు. సినిమా ఇండ‌స్ట్రీలో ద‌మ్మున్న ద‌ర్శ‌కుడి మాటే శిలాశాస‌నం.ఎంత పెద్ద స్టార్ అయినా.. నిర్మాత అయినా.. హీరోయిన్ అయినా.. ఎవ‌రైనా స‌రే ద‌ర్శ‌కుడి మాట వినాల్సిందే. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించినంత‌వ‌ర‌కు ద‌ర్శ‌కుడు ఓ కింగ్ మేక‌ర్‌.. ద‌ర్శ‌కుడు స‌ర్వాధికార సార్వ‌భౌముడు.

అయితే.. ద‌ర్శ‌కులంద‌రూ త‌మ ఆధిప‌త్యాన్ని ఆత్మాభిమాన్ని నిలుపుకోగ‌లుగుతున్నారా? లేదా? అన్న‌ది వారి వారి స‌త్తా మీద‌, సమ‌ర్థ‌త మీద ఆధార‌ప‌డింది. సినిమా అన్న‌ది పైకి స్టార్స్ మీడియాగా క‌నిపించిన‌ప్ప‌టికీ.. అంత‌ర్గ‌తంగా అది ద‌ర్శ‌కుల మీడియా. ద‌ర్శ‌కుడి సృజ‌నాత్మ‌క శిశువే సినిమా. అలాంటి ద‌ర్శ‌కుల‌లో ఎవ‌రు `నెంబ‌ర్ వ‌న్` అనేది ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ‌నీయాంశం. అయితే.. నెంబ‌ర్‌వ‌న్ పొజిష‌న్ అనేది ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతూ ఉంటుంది. అందుకే.. గ‌త ఆరు నెల‌ల కాలంలో విడుద‌లైన‌ సినిమాల నేప‌థ్యంలో పోటీ పెడితే.. ఎవ‌రు నెంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తారో చూద్దాం. 2018 జ‌న‌వ‌రి నుండి జూన్ 30 వ‌ర‌కు విడుద‌లై విజ‌యవంత‌మైన చిత్రాల ద‌ర్శ‌కుల‌లో `2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ డైరెక్ట‌ర్` ఎవ‌రో నిర్ణ‌యించ‌మంటూ ఈ పోల్ గేమ్‌కు మిమ్మ‌ల్ని ఇన్వైట్ చేస్తోంది తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్.కామ్‌`. సో.. రిలీజ్ ఆర్డ‌ర్ ప్ర‌కారం కింద ఇచ్చిన లిస్ట్ నుండి 2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ డైరెక్ట‌ర్ ఎవ‌రో మీరే నిర్ణ‌యించండి.

2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ డైరెక్ట‌ర్‌

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=nfp9ookUSWE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here