2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ ఫిల్మ్ ?

Best Film From First Half of 2018,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,First Half Best Film in 2018,Best Movies of 2018 Tollywood,Tollywood First Half Movies 2018,Best Movies 2018,Feel Good Best Movies 2018,2018 Telugu Best Movies
Best Film From First Half of 2018

ఈ రోజుతో 2018 ప్ర‌థమార్ధం పూర్త‌వుతుంది. ఈ ఆరు నెల‌ల్లో 60కి పైగా తెలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. వీటిలో ముప్ఫావు వంతు సినిమాలు ఫ్లాప్ అవ‌గా.. మిగిలిన 25 శాతంలో యావ‌రేజ్‌లూ, ఎబౌవ్ యావ‌రేజ్‌లూ, హిట్లూ, సూప‌ర్ హిట్లు ఉన్నాయి. ఇలా.. అత్య‌ధిక శాతం అప‌జ‌యాల‌తో, అత్య‌ల్ప శాతం విజ‌యాల‌తో కూడిన ఫ‌లితాలు మ‌న‌కు కొత్తేమీ కాదు. సినిమా పుట్టిన‌ప్ప‌టి నుండి ఇలా 80 శాతం అప‌జ‌యాలు, 20 శాతం విజ‌యాల అస‌మ‌తుల్య ఫ‌లితాల‌ను మ‌నం చూస్తూనే ఉన్నాము. అయితే.. ఇంత లో-సక్సెస్ రేట్ ఉన్న‌ప్ప‌టికీ సాలీనా 120-150కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అది సినిమా అనే ఇంద్ర‌జాలం ప‌ట్ల జ‌నానికి ఉన్న క్రేజ్‌కు నిద‌ర్శ‌నం. నిర్మాతలు ఎన్ని క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి సినిమాలు తీస్తున్నారో.. ప్రేక్ష‌కులు కూడా త‌మ స్థోమ‌త‌కు మించి సినిమా కోసం ఖ‌ర్చు చేస్తున్నారు.

ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే.. 2018 జ‌న‌వ‌రి నుండి జూన్ 30 వ‌ర‌కు రిలీజైన స్ట్ర‌యిట్ తెలుగు సినిమాల్లో ప‌రాజ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. విజ‌యాల‌లో ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చిన సినిమా ఏది? అన్న‌ది ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ‌నీయాంశం. కొన్ని బాగా క‌లెక్ట్ చేసి సూప‌ర్ హిట్ అనిపించుకున్న సినిమాలు కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. యావ‌రేజ్‌, ఎబౌవ్ యావ‌రేజ్ అనుకున్న సినిమాలు గొప్ప‌గా న‌చ్చ‌వ‌చ్చు. ఇలా క‌లెక్ష‌న్ల ప‌రంగా కొన్ని చిత్రాల‌కు, కంటెంట్ ప‌రంగా కొన్ని చిత్రాల‌కు విజ‌యాల‌ను క‌ట్ట‌బెట్టారు ప్రేక్ష‌కులు. ఈ నేప‌థ్యంలో.. 2018 ప్ర‌థ‌మార్ధ విజ‌యాల‌లో `ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 2018` అనే పోల్ నిర్వ‌హిస్తూ మీ పార్టిసిపేష‌న్‌ను ఆహ్వానిస్తుంది `తెలుగుఫిల్మ్ న‌గ‌ర్‌.కామ్‌`. సో.. ఈ కింద పేర్కొన్న సినిమాల్లో (రిలీజ్ ఆర్డ‌ర్ ప్ర‌కారం) 2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ ఫిల్మ్ ఏదో మీ ఓటు ద్వారా మీరే నిర్ణ‌యించండి.

2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ ఫిల్మ్?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=HWufJOczhew]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here