2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ స్టార్

2018 First Half Best Actors, 2018 Telugu Best Actors, 2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ స్టార్, Best Actors in Tollywood 2018, Latest Telugu Movie News, Most Popular Tollywood Actors, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Best Actor in 2018, Tollywood Movie Updates, Top Best Telugu Actors 2018, Who is Tollywood Best Actor in 2018
Who is Tollywood Best Actor in 2018

స్టార్‌.. ఎవ‌రేమ‌న్నా, అనుకున్నా క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు మూల‌ము, ప్రాణ‌ము, ఆధార‌మూ, ఆద్యంత‌మూ అన్నీ స్టారే. కోట్ల రూపాయిల పెట్టుబ‌ళ్ళు, కోట్లాది రూపాయిల బిజినెస్‌లు, గ్రాస్‌లు, షేర్లు, రికార్డులు, రివార్డులు, అంచ‌నాలు, ఆర్భాటాలు, విజ‌యాలు, విజ‌యోత్స‌వాలు.. ఇవ‌న్నీ స్టారాయ‌న‌మః అంటూ స్టార్ ఇమేజ్ చుట్టూ ప‌రిభ్ర‌మించే అంశాలే. ఆకాశంలో స్టార్స్ లెక్క‌కుమించి ఉంటాయి. కానీ.. సినీ వినీలాకాశంలో వేళ్ళ మీద లెక్క‌పెట్ట‌గ‌లిగే సంఖ్య‌లో మాత్ర‌మే ఉంటారు స్టార్స్‌. అలాంటి స్టార్స్‌లో ఎవ‌రి స్టామినా వారిదే అయిన‌ప్ప‌టికీ.. శుక్ర‌వారం వ‌చ్చేస‌రికి సినీ తారల తారాబ‌లాలు, గ్ర‌హ‌బ‌లాలు మారిపోతుంటాయి. ఒక‌ప్పుడు స్టార్ హీరోల మ‌ధ్య నెంబ‌ర్ గేమ్ కొంత కాలం స్థిరంగా సాగేది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏ వారం ఏ సినిమా హిట్ అయితే.. ఆ స్టార్‌దే అగ్ర స్థానం.. ఆ స్టార్‌కే అగ్ర తాంబూలం. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్న నెంబ‌ర్ గేమ్‌లో who is the top star of present time అనే ఉత్సుకత అటు ప్రేక్ష‌కాభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల‌లోనూ నెల‌కొని ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో 2018 జ‌న‌వ‌రి నుండి జూన్ వ‌ర‌కు విడుద‌లైన స్టార్స్ చిత్రాల జాబితాను ప‌రిశీలిస్తే.. ఏడుగురు టాప్ స్టార్‌లు న‌టించిన 8 చిత్రాలు క‌నిపిస్తాయి. ఆ వివ‌రాలు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ `అజ్ఞాత‌వాసి` (జ‌న‌వ‌రి 10), బాల‌కృష్ణ `జై సింహా` (జ‌న‌వ‌రి 12), ర‌వితేజ `ట‌చ్ చేసి చూడు` (ఫిబ్ర‌వ‌రి 2), రామ్ చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` (మార్చి 30), మ‌హేష్ బాబు `భ‌ర‌త్ అనే నేను` (ఏప్రిల్ 20), అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` (మే 4), ర‌వితేజ `నేల టిక్కెట్టు` (మే 25), నాగార్జున `ఆఫీస‌ర్` (జూన్ 1). సో.. ఈ ఏడుగురు అగ్ర తార‌ల‌లో 2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ స్టార్ ఎవ‌రు అనేది మోస్ట్ ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌. వారి వారి సినిమాల జ‌యాప‌జ‌యాల‌తో పాటు వారికున్న స్టాండ‌ర్ట్ ఇమేజ్‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ.. `2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ స్టార్` అనే `పోల్ గేమ్‌`కు మిమ్మ‌ల్ని ఇన్వైట్ చేస్తోంది `తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్‌.కామ్‌`.

సో.. ఇంకెందుకు ఆల‌స్యం.. సినిమాల రిలీజ్ ఆర్డ‌ర్ ప్రకారం ఇచ్చిన ఈ జాబితా నుండి `2018 ఫ‌స్టాఫ్ బెస్ట్‌ స్టార్` ఎవ‌రో మీ ఓటు ద్వారా మీరే నిర్ణ‌యించండి.

2018 ఫ‌స్టాఫ్ బెస్ట్ స్టార్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=TDTnwoVLTyw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here