హీరోయిన్ అంటే హీరో పక్కన ఉంటూ.. డ్యాన్సుల్లో స్టెప్పులేస్తూ, ఫైట్స్‌లో రియాక్షన్స్ ఇస్తూ.. హీరో కన్ను సన్నల్లో మెదిలే గ్లామర్ డాళ్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అంటే.. సినిమాల్లో గ్లామర్ పార్టుకు భుజం కాసే ఒక అందాల బొమ్మగా, సెట్ ప్రాపర్టీగా మాత్రమే మిగిలిపోయింది హీరోయిన్. అయితే.. అందరు హీరోయిన్లు అన్ని సినిమాల్లో ఇలాంటి అప్రధాన పాత్రలే చేయడం లేదు. ఒక్కో సందర్భంలో హీరోలకంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలు హీరోయిన్లకు దొరుకుతు ఉంటాయి. పాత రోజుల్లో అయితే.. హీరోలకు సరిసమానమైన పాత్రలు పోషించి అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగింది `మన కథానాయిక`.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. హీరోలకు ప్రాముఖ్యత, ప్రాధాన్యత కొరవడిన నేపథ్యంలో చాలా అరుదుగా మాత్రమే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు, పాత్రలు వస్తుంటాయి. గతాల సంగతి అలా వదిలేసి.. 2018 జనవరి నుండి జూన్ వరకు విడుదలైన చిత్రాలలో హీరోయిన్లకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అనే కోణంలో ఆలోచిస్తే.. అభినందించదగ్గ పాత్రలతో, అభినయంతో తమ ఉనికిని చాటుకుంటూ `హమ్ కిసీ సే కమ్ నహీ` అని నిరూపించుకున్నారు కొంతమంది హీరోయిన్లు. ఈ నేపథ్యంలో.. 2018 జనవరి నుంచి జూన్ వరకు వచ్చిన చిత్రాల నుండి ఏడుగురు హీరోయిన్ల మధ్య `ద బెస్ట్ హీరోయిన్ పోటీ`ని నిర్వహిస్తూ `పోల్ గేమ్`కు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తోంది `తెలుగు ఫిల్మ్ నగర్.కామ్`. సో.. ఈ ఏడుగురు అందాల బొమ్మల్లో మీ `దిల్ కి ధడ్కన్` ఎవరో మీరే ఎంపిక చేయండి.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=yo0pMqsQLkI]