2018 ఫ‌స్టాఫ్ 8లో 3.. సెకండాఫ్ 3లో ఎన్ని?

సాలీనా వంద‌కు పైగా సినిమాలు రిలీజ‌వుతున్న‌ప్ప‌టికీ.. వాటిలో టాప్ స్టార్‌ల సినిమాలు ప‌ది ప‌న్నెండుకు మించి ఉండ‌వు. ఆ ప‌ది ప‌న్నెండు మంది హీరోల సినిమాల రిలీజుల‌ప్పుడు జ‌రిగే సంద‌డి, కోలాహ‌లాలే సినిమా ఇండ‌స్ట్రీ గ్లామ‌రును, ఛ‌రిష్మాను నిల‌బెడ‌తాయి. అభిమానుల హంగామా, థియేట‌ర్ల ముస్తాబు, క‌టౌట్లు, బేన‌ర్లు, పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, డ‌ప్పులు, డ్యాన్సులు వంటి ఉత్స‌వ వాతావ‌ర‌ణం క‌నిపించేది ఆ ప‌ది ప‌న్నెండు స్టార్స్ సినిమాల‌ రిలీజ‌ప్పుడే. సినిమా గ్లామర్‌కు ముఖచిత్రం లాంటి స్టార్ల సినిమాలు ఏ మాత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నా.. అభిమానుల ఆనందానికి హ‌ద్దులుండ‌వు. ఆ స్టార్స్ కాంపౌండ్లు ఆనంద నిల‌యాలుగా మారిపోతాయి. ఈ నేప‌థ్యంలో.. 2018లో స్టార్స్ సినిమాల స్టామినా ఎంత‌? అని విశ్లేషిస్తే.. అటు సంఖ్యాప‌రంగా, ఇటు ఫ‌లితాల ప‌రంగా కొంత నిరాశ‌జ‌న‌కమైన స‌మాధానం వ‌స్తుంది.

2018 జ‌న‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కు ఏడుగురు టాప్ స్టార్‌ల ఎనిమిది చిత్రాలు విడుద‌లయ్యాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ `అజ్ఞాత‌వాసి` (జ‌న‌వ‌రి 10), బాల‌కృష్ణ `జై సింహా` (జ‌న‌వ‌రి 12), ర‌వితేజ `ట‌చ్ చేసి చూడు` (ఫిబ్ర‌వ‌రి 2), రామ్ చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` (మార్చి 30), మ‌హేష్ బాబు `భ‌ర‌త్ అనే నేను` (ఏప్రిల్ 20), అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` (మే 4), ర‌వితేజ `నేల టిక్కెట్టు` (మే 25), నాగార్జున `ఆఫీస‌ర్` (జూన్ 1).. ఇలా ప్ర‌తి నెల‌లోనూ స్టార్ హీరోల‌ చిత్రాలు విడుద‌ల కాగా.. వీటిలో `జై సింహా` హిట్‌గా.. `రంగ‌స్థ‌లం`, `భ‌ర‌త్ అనే నేను` సూప‌ర్ హిట్స్‌గా నిలిచాయి. మిగిలిన ఐదు భారీ చిత్రాలలో `నా పేరు సూర్య` యావ‌రేజ్ కాగా.. `అజ్ఞాత‌వాసి`, `ట‌చ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `ఆఫీస‌ర్` బాగా డిజ‌ప్పాయింట్ చేశాయి.

సో.. మొత్త‌మ్మీద 2018 ప్ర‌థ‌మార్థంలో ముగ్గురు స్టార్‌ల చిత్రాలు మాత్ర‌మే కొన్ని హెచ్చుత‌గ్గుల‌తో విజ‌య‌వంత‌మ‌య్యాయి.

ఇక 2018 ద్వితీయార్థంలో విడుద‌ల‌య్యే స్టార్ చిత్రాల సంఖ్య కేవ‌లం మూడు మాత్ర‌మే. నాగార్జున – నాని కాంబినేష‌న్‌లో శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ అధినేత సి.అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌లకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తొలి కాంబినేష‌న్‌లో హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తున్న `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ` భారీ అంచ‌నాల మ‌ధ్య ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న విడుద‌ల కాబోతోంది. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో మూడు రిలీజ్‌లు ఉన్న వ‌న్ అండ్ ఓన్లీ స్టార్‌గా ర‌వితేజ రికార్డు క్రియేట్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే `ట‌చ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు` రిలీజ్ కాగా.. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` కూడా ద‌స‌రా సీజ‌న్‌లో విడుద‌ల కానుంది. దీంతో 2018లో స్టార్ హీరోల చిత్రాల రిలీజ్ అయిపోయినట్టే..
సో.. 2018లో ప్ర‌థ‌మార్థంలో 8.. ద్వితీయార్థంలో 3 క‌లిపి మొత్తం 11 చిత్రాల‌కే ప‌రిమిత‌మైంది స్టార్‌డ‌మ్‌.

సో.. ఫ‌స్టాఫ్‌లో సంఖ్యాప‌రంగా ఎక్కువ రిలీజ్‌లున్న‌ప్ప‌టికీ రిజ‌ల్ట్‌ బ్యాడ్‌. ఇక సెకండాఫ్‌లో మూడు చిత్రాలే రిలీజ్‌కు ఉండ‌గా.. వాటి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. మొత్తానికి 2018లో తార‌ల‌కు తారా బలం అనుకూలించిన‌ట్లు లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=QJXKUOQg5gY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here