64 కళల్లో అన్నింటి పట్ల అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు.. కానీ అందరూ ఇష్టపడే సార్వజనీన కళ సంగీతం. శిశువులు, పశువులు, పండితులు, పామరులు అనే తేడాలు గానీ.. వయోలింగ భేదాలు గానీ లేకుండా సకళజీవకోటిని అలరించే మహిమాన్విత శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంది. అందుకే ”music is divine and music is universal” అంటారు. జాతి, మత, భాషా, ప్రాంతీయాది విబేధాలకు అతీతమూ, సార్వజనీనమూ అయిన సంగీతానికి అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక దినం కేటాయించబడిందని చాలా మందికి తెలియదు. అదే జూన్ 21. అంటే ఈ రోజే..
సో.. విశ్వవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులందరికీ అంతర్జాతీయ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా తమ పాఠకులను చిన్న పోల్ గేమ్‌కు ఇన్వైట్ చేస్తోంది ‘తెలుగు ఫిల్మ్‌నగర్.కామ్’. ఈ 2018 జనవరి నుండి అంతర్జాతీయ సంగీత దినోత్సవమైన జూన్ 21 వరకు విడుదలై విజయవంతమవడంతో పాటూ మంచి మ్యూజికల్ హిట్స్‌గా కూడా నిలిచిన ఆరు చిత్రాలను, ఆ సంగీత దర్శకుల పేర్లను ఇక్కడ ఇస్తున్నాం. వీరిలో మీకు ఇష్టమైన సంగీత దర్శకుడిని మీరే ఎంపిక చేయండి. అత్యధిక ఓట్లు సాధించిన సంగీత దర్శకుడిని ‘Musician of the Music Day’ గా నాలుగు రోజుల తరువాత (జూన్ 25)న ప్రకటించి అభినందిద్దాం.. సో.. ఇంకెందుకు ఆలస్యం.. let us start the ‘Poll Game’..
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=A7fjK5wMSvc]