లెజండ‌రీ కాంబినేష‌న్‌ ‘ర‌త్నం – రాజా’కు హ్యాపీ బ‌ర్త్ డే

లెజండ‌రీ కాంబినేష‌న్‌ ర‌త్నం – రాజా కు హ్యాపీ బ‌ర్త్ డే,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Movie Updates,Birthday Wishes To Ilayaraja and Mani Ratnam,Birthday Wishes To Legend Music Director Ilayaraja,Birthday Wishes To Mani Ratnam

వాళ్ళిద్ద‌రి పుట్టిన‌రోజు ఒక‌టే. జూన్ 2. వాళ్ళిద్ద‌రు సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అందుకున్న‌వారే. 80 – 90 ద‌శ‌కాల‌లో వారిద్ద‌రి కాంబినేష‌న్ ద‌క్షిణ భార‌త‌దేశంలో ముఖ్యంగా.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించింది. వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో మొత్తం 10 సినిమాలు వ‌స్తే వాటిలో మొద‌టి నాలుగు సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్‌లు. నాలుగు ఫ్లాప్‌ల త‌రువాత ఆ కాంబినేష‌న్‌ను ఏ నిర్మాత ఒప్పుకోడు. కానీ ఆ త‌రువాత వ‌రుస‌గా వారి కాంబినేష‌న్‌లో ఆరు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ వ‌చ్చాయి. అంత‌టి ఘ‌న‌విజ‌యాలు సిద్ధించాక వారి కాంబినేష‌న్‌కు దిష్టి త‌గిలిందో ఏమో ఇద్ద‌రూ విడిపోయారు. విడిపోయాక ఎవ‌రి దారిలో వారు.. వారి వారి విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగించారు. మ‌ర‌ల ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేయ‌లేదు. అయినా ఆ ఇద్ద‌రు ఇండియ‌న్ స్క్రీన్ పైన ఇన్‌క్రెడిబుల్ ఇంపాక్ట్ క‌న‌ప‌రిచారు. వారే.. ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం, సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా.

ఇద్ద‌రూ పుట్టింది జూన్ 2నే. ఇళ‌యరాజా 1943 జూన్ 2న పుట్ట‌గా.. మ‌ణిర‌త్నం 1956 జూన్ 2న పుట్టారు. ఇద్ద‌రూ క‌లిసి తొలిసారిగా 1983లో ‘ప‌ల్ల‌వి అనుప‌ల్ల‌వి’ అనే క‌న్న‌డ చిత్రం చేశారు. అది ఫ్లాప్‌. ఆ త‌రువాత ‘ఉణ‌రు’ అనే మ‌ల‌యాళ చిత్రం చేశారు. అది ఫ్లాపే. ఆ త‌రువాత ‘ప‌గ‌ల్ నిల‌వు’, ‘ఇద‌య కోవిల్’ అనే త‌మిళ చిత్రాల‌కు ప‌నిచేశారు. అవీ ఫ్లాపే. అలా వ‌రుస‌గా 4 ఫ్లాపుల త‌రువాత వారిద్ద‌రి సంచ‌ల‌న జైత్ర‌యాత్ర‌కు శ్రీ‌కారంగా నిలిచిన చిత్రం ‘మౌన‌రాగం’. ఒక ద‌ర్శ‌కుడికి, సంగీత ద‌ర్శ‌కుడికి మధ్య మంచి ట్యూనింగ్ కుదిరితే ఎంత శ్రావ్య‌మైన బాణీలు, ఎంత మ‌ధుర‌మైన పాట‌లు వ‌స్తాయో చెప్ప‌డానికి నిద‌ర్శ‌నంగా డ‌బుల్ హ్యాట్రిక్ దాకా సాగింది వారి కాంబినేష‌న్‌.
‘మౌనరాగం’తో ప్రారంభ‌మైన వారి జైత్ర‌యాత్ర‌లో వ‌రుస‌గా ‘నాయ‌కుడు’, ‘ఘ‌ర్ష‌ణ‌’, ‘గీతాంజ‌లి’, ‘అంజ‌లి’, ‘ద‌ళ‌ప‌తి’ చిత్రాలు వ‌చ్చాయి. ఒక ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు కాంబినేష‌న్‌లో వ‌రుస‌గా ఆరు చిత్రాల డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదు కావ‌డం.. అదే ఫ‌స్ట్ టైమ్ కావ‌చ్చు. ‘ఘ‌ర్ష‌ణ‌’లో ”ఒక బృందావ‌నం సోయ‌గం”, ”నిను కోరి వ‌ర్ణం”, ”రాజా రాజాధి రాజా”.. ‘గీతాంజ‌లి’లో ”ఆమ‌ని పాడవే హాయిగా”, ”ఓం న‌మహా”, ”ఓ ప్రియా ప్రియా”, ”ఓ పాపా లాలీ”, ”జ‌గ‌డ జ‌గ‌డ జ‌గ‌డం”, ”జ‌ల్లంత క‌వ్వింత‌” పాట‌లు, ‘అంజ‌లి’లో ”అంజ‌లి అంజ‌లి విరిసే న‌వ్వుల పువ్వుల జాబిలి”, ‘ద‌ళ‌ప‌తి’లో ”సింగారాల” ”చిల‌క‌మ్మా చిటికేయంగా”.. ఇలా ఎన్నెన్నో మెలోడీల తాలుకూ స్మృతుల‌ అల‌లు మ‌న హృద‌య తీరాల‌ను సున్నితంగా స్పృశిస్తాయి.. జానే క‌హా గయే వో దిన్‌.. అనిపిస్తాయి.
ఇలా ఒకే రోజు పుట్టి ఒకే రంగంలో ఒక‌టిగా ప‌నిచేసి విడిపోయిన దిగ్ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం, 75 వ‌సంతాలు పూర్తిచేసుకున్న‌ సంగీత పుంభావ స‌రస్వ‌తి ఇళ‌య‌రాజాకు హృద‌య‌పూర్వ‌క శుభాభినంద‌న‌లు ప‌లుకుతూ.. మ‌రల ఆ ఇద్ద‌రు ఒక్క‌టై ఏకోన్ముఖ ప్ర‌యాణం సాగించాల‌ని ఆశిస్తోంది ‘తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌. కామ్‌’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here