ఇకపై తన సినిమాల వేగం పెంచుతానంటున్న మెగా హీరో…

గౌర‌వం, కొత్త‌జంట‌, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, ఒక్క‌క్ష‌ణం చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన హీరో అల్లు శిరీష్‌. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో శిరీష్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. చిన్నప్పట్నుంచి పుట్టినరోజు పెద్దగా చేసుకొనే అలవాటు లేదు. వేసవి సెలవుల్లో వస్తుంది గనుక చదువుకొనే సమయంలో స్నేహితులందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళేవారు. హీరో కాకముందు మహా అయితే మూడుసార్లు పుట్టినరోజు సంబరాలు చేసుకున్నానేమో! హీరో అయిన తర్వాత కూడా మార్పేమీ లేదు. గత ఏడాది రిలీజైన ‘ఒక్క‌క్ష‌ణం’ సినిమా గురించి మాట్లాడుతూ నా వ‌ర‌కు ‘ఒక్క క్ష‌ణం’ నా కెరీర్‌లో బెస్ట్ ఫిలిం” అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. సూర్య నా అభిమాన హీరో అని చాలాసార్లు చెప్పా. తమిళంలో సూర్య, మోహన్ లాల్ కలిసి చేస్తున్న చిత్రంలో కూడ ఒక కీలక పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో హీరో సూర్యతో సమానమైన పాత్రలో కనిపించనున్నానని ఆనందంగా చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్.
ప్రస్తుతం ‘ఏబిసిడి’ తెలుగు రీమేక్ కోసం సంసిద్దమవుతున్నారు . నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రానికి తెలుగు రీమేక్ గా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ సినిమాకు కన్నడ కంపోజర్ జుడా శాండీ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ సంగీత దర్శకుడ్ని అల్లు శిరీష్ ఏరి కోరి ఎంచుకోవడం విశేషం. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయకిగా ఎవరు నటించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కమర్షియల్‌గా ముందుకెళ్లాలంటే ఎక్కువ సినిమాలు చేయాలి. ఇకపై ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను అని తన మనసులో మాటను అల్లు శిరీష్ బయటపెట్టాడు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here