హైదరాబాద్ లో కాలా సినిమాసందడి

తమిళ్ సూపర్ స్టార్,తలైవా రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండుగే. తన మేనరిజమ్స్,స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకాభిమానులను అలరించే రజనీ కాంత్ కు తమిళనాడు లోనే కాకుండా దేశ వ్యాప్తం గా అభిమానులున్నారు.
వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై హీరో ధనుష్ నిర్మాణసారధ్యం లో రజనీ కాంత్ హీరో గా పా రంజిత్ దర్శకత్వం వహించిన కాలా చిత్రం జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది.

కబాలి సినిమా తరువాత రజనీకాంత్,పా రంజిత్ కాంబినేషన్ లో ముంబై బ్యాక్ డ్రాప్ లోరూపొందింది . మురికివాడల నేపధ్యం లో రూపొందిన ఈ చిత్రం లో కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రో లో రజనీకాంత్ నటించారు.
మే 9వ తేదీ కాలా సినిమా ఆడియో రిలీజ్ వేడుక చెన్నై లో జరిగింది. మే 29వ తేదీ హైదరాబాద్ నోవాటెల్ లో కాలా సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here