అతిథి పాత్ర‌లో అను

అతిథి పాత్ర‌లో అను,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema News 2018,Tollywood Movie Updates,Anu Emmanuel In Guest Role,Anu Emmanuel to play cameo in Vijay Deverakonda film,Anu Emmanuel Guest Role In Vijay Deverakonda Film,Actress Anu Emmanuel to do a cameo,Heroine Anu Emmanuel Cameo In Vijay Deverakonda Next
Anu Emmanuel In Guest Role

‘మ‌జ్ను’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక‌ కేర‌ళ‌కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. ఆ త‌రువాత వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. ఈ ఏడాదిలో ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘అజ్ఞాత‌వాసి’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాల్లో క‌థానాయిక‌గా సంద‌డి చేసింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘శైల‌జా రెడ్డి అల్లుడు’ (ప్ర‌చారంలో ఉన్న పేరు)లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో అతిథిగా న‌టించే అవ‌కాశాన్ని పొందింద‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ‘ఛ‌లో’ ఫేమ్ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం కోసమే అను స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ఇవ్వ‌నుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. త్వ‌ర‌లోనే అను ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. ఇదిలా ఉంటే.. కాల్షీట్ల స‌మ‌స్య కార‌ణంగా ర‌వితేజ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని’ నుంచి అను త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here