అల్లరి నరేష్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్సకత్వంలో నిర్మితమతున్న కామెడీ ఎంటర్టైనర్ కు సిల్లీ ఫెలోస్ అనే టైటిల్ పెట్టినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను దర్శకుడు ఖండించారు. “టైటిల్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాం…దాదాపు రెండు వందల టైటిల్స్ అనుకుని 5 టైటిల్స్ రిజిష్టర్ చేయించి ఇప్పడు ఆ ఐదులో ఏది ఫైనల్ చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాం.
అయితే ఆ ఐదులో “ఫన్ రాజా ఫన్” అనే టైటిల్ బాగుందని ఫ్రెండ్స్ అంటున్నారు. కాబట్టి అదే ఫైనల్ చేయవచ్చు.. ఇందులో నరేష్ కు జోడిగా చిత్రా శుక్లా చేస్తుంది. ఒక ముఖ్య పాత్ర చేస్తున్న సునీల్ పక్కన నందినీ రాయ్ చేస్తుంది. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది… జూన్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం” అని తెలియజేసారు భీమినేని శ్రీనివాస రావు.