హ్యాపీ బర్త్ డే టు విజయ్ దేవరకొండ

హ్యాపీ బర్త్ డే టు విజయ్ దేవరకొండ,Telugu Filmnagar,Telugu Film News 2018,Latest Telugu Cinema News,Tollywood Movie Updates,Happy Birthday To Vijay Deverakonda,Birthday Wishes To Vijay Deverakonda,Actor Vijay Deverakonda Latest News,Hero Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates

పెళ్ళిచూపులు సినిమా ఘన విజయం తో విజయ్ దేవరకొండ గుర్తింపు పొంది,అర్జున్ రెడ్డి సినిమా తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సినిమా లో విజయ్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అర్జునరెడ్డి సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజయ్ నటించిన సావిత్రి బయోపిక్ మూవీ మహానటి సినిమా ఈ రోజే రిలీజయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న టాక్సీవాలా,నోటా (తెలుగు,తమిళ్ )సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా డియర్ కామ్రేడ్ పేరుతో అనౌన్స్ అయింది.

మే 9వ తేదీ విజయ్ దేవరకొండ బర్త్ డే.విజయ్, తన బర్త్ డే ను వినూత్నం గా జరుపుకుంటున్నారు. ఎవరైనా తమ బర్త్ డే ను స్నేహితులకు,బందువులకు, తెలిసినవారికి  చాకోలెట్స్,కేక్,స్వీట్స్ పంచిపెడతారు. కానీ విజయ్ హైదరాబాద్ ప్రజలకు ఐస్ క్రీమ్ పంచిపెడుతున్నారు. ఆ విషయం ఆయన మాటల్లోనే .. తనకు పుట్టినరోజు జరుపుకొనడం ఇష్టం ఉండదని,సమ్మర్ కాబట్టి ప్రజలను కూల్ చేయడానికి 3 ఐస్ క్రీమ్ ట్రక్స్ తో హైదరాబాద్ రోడ్స్ కవర్ చేసి ఐస్ క్రీమ్ ను ప్రజలకు పంచిపెడుతున్నానని ఎవరైనా సరే  ఐస్ క్రీమ్ తీసుకుని తినవచ్చు అని అన్నారు.ఆనందంతో ఐస్ క్రీమ్ తిన్నవారు ఫోటోలు పంపిస్తే, ఆ ఫోటోలు చూసి తాను సంతోషిస్తాననని అన్నారు. ఒక ఐస్ క్రీమ్ ట్రక్ లో తాను కూడా ప్రయాణిస్తానన్నారు.

విజయ్ దేవరకొండ కు తెలుగు ఫిల్మ్ నగర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here