మరో మల్టీ స్టారర్ కి శ్రీకారం చుట్టిన విక్టరీ వెంకీ

Hero Venkatesh & Varun Tej Multi Starrer Movie Latest News, Hero Venkatesh Multi Starrer Movie Updates, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, Victory Venkatesh And Varun Tej Multi Starrer, మరో మల్టీ స్టారర్ కి శ్రీకారం చుట్టిన విక్టరీ వెంకీ

విక్టరీ వెంకటేశ్ అంటే ఇష్టపడని వాళ్లుండరు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ప్రేక్షకుల్లో కూడా ఆయనకు యాంటీ ఫ్యాన్స్ ఎవ్వరూ ఉండరు. అందుకే ప్రతీ హీరో ఆయనతో కలిసి స్క్రీన్ స్పేస్ ను పంచుకునేందుకు ఇష్ట పడుతుంటారు. ఆ క్రమంలోనే మనం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా వంటి మల్టీ స్టారర్ లు చూడగలిగేము.

అయితే ఇప్పుడు తాజాగా వెంకటేశ్, వరుణ్ తేజ్ లు కథానాయకులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్2’ (ఫన్ & ఫ్రస్ట్రేషన్). ఎవరు ఫన్ క్యారెక్టర్ చేయబోతున్నారు? ఎవరు ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శుకుడు అనిల్ మాట్లాడుతూ “జూన్ నెల నుండి సెట్ లో ఫన్ స్టార్ట్ అవ్వబోతుంది” అంటూ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యేది అప్పుడే అన్నట్టు ఆయన చెప్పారు. కాగా, ఇటీవలే ఈ చిత్ర టైటిల్ లోగోను చిత్ర బృందం అధికారకంగా రిలీజ్ చేసారు. వి2 (వెంకీ & వరుణ్ తేజ్) కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ రేంజ్ లో ఫన్ పంచుతుందో చూడాలి మరి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here