రంగస్థలం విలేజ్ సెట్లో జరగనున్న సైరా షూటింగ్

రంగస్థలం విలేజ్ సెట్లో జరగనున్న సైరా షూటింగ్,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Sye Raa Movie Updates,Sye Raa Movie Shooting In Rangasthalam Village Sets,Shooting for Rangasthalam made me reconnect with my village roots,Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy Movie Shooting Updates,Chiranjeevi Sye Raa Narasimha Reddy Telugu Movie Shooting Latest News

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం అందరకీ తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా రూపొందించిన కోయిలకుంట్ల ట్రెజరీ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ షూటింగ్ పూర్తయ్యాక మొదలవ్వబోయే కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ కోసం వేసిన విలేజ్ సెట్స్ లో మరొక భారీ సెట్ ను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సెట్ పనులు త్వరలోనే ముగియనున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా, చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here