దిమ్మతిరిగిపోయే యాక్షన్ సీన్స్ తో ‘నా పేరు సూర్య’

దిమ్మతిరిగిపోయే యాక్షన్ సీన్స్ తో నా పేరు సూర్య,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Naa Peru Surya Movie Updates,Naa Peru Surya Telugu Movie Latest News,The Actions Sequences in Naa Peru Surya will give Goosebumps,Stylish Star Allu Arjun Naa Peru Surya Movie Latest News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. మే 4న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకునే, బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లను ఎంతో పగడ్బందీగా తీర్చిదిద్దుతున్నారు చిత్ర దర్శకుడు వక్కంతం వంశీ. ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ప్రతీ యాక్షన్ సీన్ రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు.

ఇంతకు ముందు విడుదలైన రెండు టీజర్ లను చూసినా ఇదే అర్ధం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదలై శ్రోతల నుండి మంచి స్పందనను గెలుచుకున్నాయి. అయితే పూర్తి ఆడియోను ఈ నెల 22న విడుదల చేసి, 29వ తేదీన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. కాగా ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here