సందేహాలను పటాపంచలు చేసిన కీర్తి సురేష్

సందేహాలను పటాపంచలు చేసిన కీర్తి సురేష్,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Keerthy Suresh First Look And Teaser Released,Mahanati Movie Updates,Mahanati Telugu Movie Latest News,Mahanati Movie Teaser,Mahanati Telugu Movie Teaser,Mahanati Teaser Released,Actress Keerthy Suresh First Look From Mahanati Movie,Heroine Keerthy Suresh First Look Released From Mahanati Telugu Movie

భారత సినీ రంగంలో సావిత్రి గారికి ఎంతో విలువైన స్థానం ఉంది. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేయటంలో ఆమెకు ఆమె సాటి. అంతటి మహోన్నతమైన నటి జీవితం ఆధారంగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న చిత్రం మహానటి. ఇందులో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్రకు కీర్తి ఎంతవరుకు న్యాయం చేస్తుందో అన్న అనుమానం అందరిలోనూ నెలకొంది. ఈ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసిన కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ మరియు తాజాగా కొద్ది క్షణాల ముందు విడుదల అయ్యిన టీజర్ ని చూసి అందరూ ఫిదా అయిపోయారు.
ఆ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను చూస్తే అందులో ఉన్నది నిజంగా సావిత్రిగారేనేమో అనిపిస్తూ, కీర్తి సురేష్ తప్పకుండా పాత్రకు న్యాయం చేసుంటారనే భరోసా కలిగిస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి. కాగా, వైజయంతి మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్

[youtube_video videoid=AGbO7eckjzo]

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here