తుది మెరుపులు దిద్దుకుంటున్న భరత్ అనే నేను

భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 20న విడుదల కానున్న ‘భరత్ అనే నేను’ చిత్రం ఈ రోజు సెన్సార్ కి వెళ్లనుంది. కాగా, ఈ చిత్రం మొదటి కాపీ వచ్చే వారానికి సిద్ధం కానుంది. ప్రస్తుతం ‘మహేష్’ తన ఫ్యామిలీతో పాటు హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చే వారం తిరిగి హైదరాబాద్ వచ్చి ప్రొమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయనున్నాడని సమాచారం.

డి.వి.వి దానయ్య నిర్మాణంలో, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ మరియు పాటలకు అనూహ్య స్పందన వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here