కాజల్ ను వెతుక్కుంటూ వచ్చిన సువర్ణావకాశం

కాజల్ ను వెతుక్కుంటూ వచ్చిన సువర్ణావకాశం,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Kajal Roped In Ntr Biopic,Ntr Biopic Movie Updates,Ntr Biopic Telugu Movie Latest News,Kajal Aggarwal role in NTR biopic revealed,Kajal Aggarwal as Jayalalithaa in NTR biopic,Kajal Aggarwal to play Jayalalitha in NTR biopic,Kajal Aggarwal as Jayalalithaa in NTR biopic

టాలీవుడ్ కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ది ఓ ప్రత్యేకమైన పంథా. జయాపజయాలకు లొంగిపోకుండా కేవలం తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతీ పాత్రకు తనదైన శైలిలో న్యాయం చేకూరుస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆమె. 2007 లో ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రం ద్వారా మన తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై భామ అదే సంవత్సరంలో వచ్చిన ‘చందమామ’ చిత్రంతో మంచి గుర్తింపుని సాధించారు. ఇక 2009లో వచ్చిన ‘మగధీర’ చిత్రం ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన ‘ఖైదీ నెం. 150’ లో గ్లామర్ డాల్ గా కనిపించగా, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఆ!’ చిత్రాల్లో హృద్యమైన పాత్రలతో, తన అసాధారణమైన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ఇప్పుడు తాజాగా ఆమెకు తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ‘జయలలిత’ గారి పాత్రను పోషించటానికి అవకాశం వచ్చింది. “NBK Movies” బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘నందమూరి బాలకృష్ణ’ ఎన్టీఆర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘ఎం.ఎం కీరవాణి’ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్బంగా కాజల్ ‘అమ్మ’ (జయలలిత) జ్ఞాపకాలను గుర్తు తెచ్చే విధంగా నటించి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ కాజల్ కి “అల్ దీ బెస్ట్”

లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ Telugu Filmnagar కి subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here