స్టైలిష్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు                                                                            

స్టైలిష్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Birthday Wishes To Stylish Star Allu Arjun,Actor Allu Arjun Latest News,Hero Allu Arjun New Movies,Allu Arjun Upcoming Movies List
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా విజేత సినిమా లో,డాన్సర్ గా డాడీ సినిమా లో నటించారు. 2003 వ సంవత్సరం కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో “గంగోత్రి “సినిమాతో హీరో గా సినీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. డైరెక్టర్ గా రాఘవేంద్రరావు 100వ సినిమా గంగోత్రి విజయం సాధించి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ తన డాన్స్ లు,పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఆర్య.
  అల్లు అర్జున్ నటించిన ఆర్య ,బన్నీ సినిమాలు తెలుగు లోనే కాకుండా,మలయాళం డబ్బింగ్ అయి ఘన విజయం సాధించాయి. ఆ సినిమాలతో మలయాళ భాషలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటినుంచి అతను నటించిన సినిమాలన్నీ మలయాళం లో డబ్బింగ్ జరుపుకుని కేరళ రాష్ట్ర ప్రజలను అలరిస్తున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన”దేశముదురు “సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. తన పెర్ఫార్మెన్స్ ,ఫైట్స్ ,డాన్స్ లతో ప్రేక్షక ,అభిమానులను ఉర్రూతలూగించారు. పరుగు ,ఆర్య 2 ,వేదం ,ఇద్దరమ్మాయిలతో,S%సత్యమూర్తి ,రుద్రమదేవి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి.రేసుగుర్రం ,సరైనోడు ,డీజే సినిమాలు ఘన విజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరాయి.
 టాలీవుడ్ లోనే కాదు ఇండియా లోనే బెస్ట్ డాన్సర్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ ప్రశంసించింది.పాప్యులర్ మలయాళీ టీవీ ఛానల్ ASIA NET,అల్లు అర్జున్ ను “ప్రవాసి రత్న “పురస్కారంతో సత్కరించింది.ప్రెజెంట్ జనరేషన్ లో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు నటుడు. అల్లుఅర్జున్ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా  నటించిన నా పేరు సూర్య భారీ అంచనాలతో మే 4వ తేదీ రిలీజ్ కాబోతుంది.ఆ సినిమా గురించి ప్రేక్షక ,అభిమానులుచాలా  ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు ఫిల్మ్ నగర్ శుభాకాంక్షలు చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here