ఇంకాస్త ఎక్కువ కష్టపడతాం

ఇంకాస్త ఎక్కువ కష్టపడతాం,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Cinema Updates,Tollywood Film News,Koratala Siva Thanks To Audience,Director Koratala Siva Latest News,Koratala Siva Upcoming Movie News,Koratala Siva Next Film Updates
Koratala Siva Thanks To Audience

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం భరత్ అనే నేను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమా టీజర్ ని నిన్న సాయంత్రమే చిత్రబృందం రిలీజ్ చేసింది. టీజర్ ప్రేక్షకులకు, అభిమానులకు తెగ నచ్చడంతో..కొరటాలపై ప్రశంశలజల్లు కురుస్తోంది.

తాజాగా కొరటాల మాట్లాడుతూ భరత్ అనే నేను టీజర్ పై ఇచ్చిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కు మీ అందరికి కృతజ్ఞతలు. మీ కోసం మా టీం అంతా ఇంకాస్తా కష్టపడి..మంచి సినిమాను అందిస్తాం అని తెలిపారు. ఇదివరకే ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి భారీ గానే అంచనాలు ఉన్న నేపథ్యంలో నిన్నటి టీజర్ కూడా వాటికి బూస్టప్ గా ఆకాశానంటే అంచనాలు నిర్మించిందని చెప్పాలి. నిజాయితీ, నిబ్బద్దత కలిగిన సీఎం పాత్రలో మహేష్ కనిపించనున్నాడు. ఆల్రెడీ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో కేవలం మిగిలిన లండన్ షెడ్యూల్ కూడా త్వరలో మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ కాగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్ 20న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here