మే నుండి రానా దోపిడీలు

మే నుండి రానా దోపిడీలు,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Rana Next Movie Starts From May First Week,Rana Daggubati Latest News,Hero Rana Daggubati Upcoming Movie Updates,Actor Rana Daggubati Next Film News,Rana Upcoming Movie Shooting Statrs From May 1st Week

రానా, గతేడాది నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎప్పుడు వైవిధ్యమైన కథలకే ఓటు వేసే రానా ఈ సారి కూడా అదే పంథాలో నడుస్తున్నాడు. బ్రిటిష్ కాలంలో భూస్వాములను, డబ్బున్న బడా బడా బాబులను దోచి, పేదలకు పంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో రానా నటించనున్నాడు.

ఈ కొత్త ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్తే..కిట్టు ఉన్నాడు జాగ్రత్త, దొంగాట వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. స్క్రిప్ట్ విన్న రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రానా ఇందులో డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో పూజ కార్యక్రమాల ద్వారా లాంచ్ చేసుకుని, మే మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ వెళ్లాలని ఇనీషియల్ ప్లాన్ వేశారట. ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here