నాగార్జునతో కళ్యాణ్ రామ్ పోటీ

నాగార్జునతో కళ్యాణ్ రామ్ పోటీ,Kalyan Ram Naa Nuvve Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Naa Nuvve Movie Updates,Naa Nuvve Telugu Movie Latest News,Naa Nuvve Movie Release Date Fixed,Naa Nuvve Telugu Movie Release Date Confirmed,Nandamuri Kalyan Ram Naa Nuvve Movie Releasing On 25th of May 2018

కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం నా నువ్వే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలెట్టేశారు. ఇక ఇవాళే ఈ సినిమాని మే 25న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం విశేషం. కానీ ఇదే డేట్ కి రామ్ గోపాల్ వర్మ, నాగార్జునల ఆఫీసర్ కూడా అదే రోజు రిలీజ్ కానుండడంతో ఈ సారి బాక్స్ ఆఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.

ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ పై భారీ అంచనాలను నెలకొల్పింది. కళ్యాణ్ రామ్ ఇందులో సరికొత్త మేకోవర్ లో దర్శనమివ్వనున్నాడు. స్టోరీ ప్రకారం..తమన్నా రేడియో జాకీగా లవ్ గురుగా మాట్లాడుతుందని, ఇదే నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కలవడం..ఇలా ఫీల్ గుడ్ జోనర్ ల సాగుతుందని సమాచారం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ PC శ్రీరామ్ ఈ సినిమాకి పనిచేస్తుండడం మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. శరీత్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here