తేజ, వెంకీ సినిమాలపై ఆసక్తికర వార్త

తేజ వెంకీ సినిమాలపై ఆసక్తికర వార్త,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Interesting Update On Teja And Venkatesh Movie,Latest News On Director Teja & Venkatesh Film,Hero Venkatesh Upcoming Movie Latest Update

వెంకటేష్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న వార్త అందరికి తెలిసిందే. దీనికి ‘ఆట నాదే వేట నాదే’ అనే ఆసక్తికర టైటిల్ పరిశీలనలో ఉండగా దీనిపై ఓ ఆసక్తికర వార్త బయటకు పొక్కింది. అదేంటంటే వెంకటేష్ కి దీటుగా నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటించనుండగా, ఆయనకు భార్య పాత్రలో ఈషా రెబ్బా నటించనుందని తెలుస్తోంది.

కథలో ఈషా పాత్ర చాలా కీలకం కాబోతోందని, నారా రోహిత్ కు సరైన జోడిగా కుదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. యాక్షన్ ఎంటర్ జోనర్ తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 12 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టుకుని ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే యోచనలో చిత్రబృందం ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనుండగా, రామానుజం సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ మరియు సురేష్ బాబులు సంయుక్తంగా నిర్మించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here