ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల హీరోయిన్ ఖరారు

ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల హీరోయిన్ ఖరారు,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Heroine Confirmed For For Ntr And Trivikram Movie,Actress Pooja Hegde Latest News,Heroine Pooja Hegde Upcoming Movie News,Pooja Hegde Next Film With Jr Ntr,#NTR28 Movie Latest News

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ అన్నిరకాలుగా రెడీ అయ్యి, తన బాడీని మంచి ఫిట్ గా మార్చుకుంటున్నాడు. షూటింగ్ కి ఇంకా నెలరోజులు కూడా లేకపోవడంతో హీరోయిన్ ఎవరన్నది మాత్రం చిత్ర బృందం చెప్పకుండా కాస్త కంగారు పెట్టేశారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే ని ఖరారు చేశారట. ఆల్రెడీ పూజతో కథా చర్చలు పూర్తవ్వగా, సంతకాల ప్రక్రియ కూడ ముగిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఈ ప్రాజెక్టు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది. త్రివిక్రమ్..ఎన్టీఆర్ కోసం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీని అన్ని రకాల ఎమోషనల్ ఎమెలెంట్స్ తో తయారు చేశాడట. ఎస్ థమన్ సంగీతం సమకూర్చనుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ PS వినోద్ కెమెరాను హ్యాండిల్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్టును హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధా కృష్ణ నిర్మించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here