రచయిత మూవీ రివ్యూ

రచయిత మూవీ రివ్యూ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Film News 2018,Telugu Cinema Updates,Rachayitha Telugu Movie Review And Rating,Rachayitha Movie Updates,Rachayitha telugu Movie Latest News,Rachayitha Movie Review,Rachayitha telugu Movie Review,Rachayitha Review,Latest Telugu Movies Reviews 2018

సినిమా : రచయిత
నటీనటులు : విద్యాసాగర్ రాజు, సంచిత పదుకొనె
దర్శకత్వం : విద్యాసాగర్
సంగీతం : షాన్ రెహమాన్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
నిర్మాత : కళ్యాణ్ ధూళిపాళ్ళ
బ్యానర్ : దుహారా మూవీస్

Click Here for Manasuku Nachindi Movie Review

కథ : పద్మావతి, అరుణ్ లు తమ స్వచ్ఛమైన ప్రేమను పెద్దలకు చెప్పి వారి అంగీకారం మేరకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఇదే క్రమంలో పెళ్లయ్యాక నివశించాడనికి సముద్రతీరాన ఉన్న ఓ బంగాళాను కొనడానికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉంటారు. ఇక తిరుగు ప్రయాణంలో వాళ్ళు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై అరుణ్ పెద్ద లోయలో పడి మరణిస్తాడు. ఇక ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేని పద్మావతి అతని జ్ఞాపకాలతోనే రోజు బాధను అనుభవిస్తూ ఉంటుంది. కట్ చేస్తే తన కథలతో మంచి పేర గడించిన ఆదిత్య వర్మ ఈమె ఇంటికి వచ్చి తనని పెళ్లి చేసుకుంటానని, తన గతం చెప్తాడు. ఇక ఓ కథ రాయడం కోసమని పద్మావతిని కూడా ఒకప్పుడు ఈమె ఉన్న బంగళాకు తీసుకెళ్తాడు. అక్కడి వెళ్లిన పద్మావతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అసలు ఆదిత్య వర్మకు పద్మావతికి సంబంధం ఏంటి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :
దర్శకుడు విద్యాసాగర్ ఈ సినిమా కథను చాలా డిఫెరెంట్ గా కవితాంత్మకంగా రాసుకున్నాడు. ఓపెనింగ్ నుండే ఎలాంటి అనవసర సీన్స్ పెట్టకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్లడం చాలా బాగుంది. ప్రియుడిని కోల్పయిన బాధలో పద్మావతిని ఉంచి, అంతలోనే ఆదిత్య వర్మను కథలోకి దింపి పెళ్లి చేసుకుంటాను అని అడగడం, ఆలా వారి ప్రయాణం ఆద్యంతం థ్రిల్లింగ్ గా చూపించాడు. ఆదిత్య వర్మ భయం అనే అంశం మీద కథ రాసుకుంటుండడం..ఆ కథ యాదృచ్చికంగా పద్మావతి జీవితాన్ని ప్రతిభింబించేలా చేసి దర్శకుడు తనలోని ప్రతిభను కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ తో ముగించి సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తిని రేకెత్తించాడు. ఇక సెకండ్ హాఫ్ లో పద్మావతి మానసిక క్షోభను, తన కథలోని తీవ్రతను చూపించే సన్నివేశాలు బాగున్నాయి. దర్శకుడిలో అద్భుతమైన టాలెంట్ గురించి మాట్లాడుకుంటే..కేవలం రెండు క్యారెక్టర్స్ తోనే అద్భుతమైన థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. అది కూడా ఎలాంటి బోరింగ్ సన్నివేశాలు లేకుండా..ఆదిత్య వర్మ పలికే ప్రతి డైలాగ్ లోనే ఓ నిగూఢమైన అర్థం దాగుంది. క్లైమాక్స్ మాత్రం ఆరంభం నుంచి వేసుకున్న చిక్కుముడులన్నీ ఒక్కసారిగా ఏమాత్రం కంగారు లేకుండా నీట్ గా సాధారణ ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా చాలా బాగుంది.

నటీనటుల పనితీరు :
విద్యాసాగర్, ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించి దర్శకత్వం వహించాడు కాబట్టి ఇతనిది సాహసమనే చెప్పాలి. ఒక రచయితకు ఉండాల్సిన ప్రతి ఒక్క క్వాలిటీస్ ఆదిత్య వర్మకు నూటికి నూరుపాళ్లు ఉన్నాయని చెప్పాలి. ఇతను చాలా ఇంటెన్స్ నటనతో, డైలాగ్ డెలివరీ, వెర్సటాలిటీ పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. ఇక హీరోయిన్ గా నటించిన సంచిత పదుకొనె కూడా మంచి నటనే కనబర్చింది. ఎమోషనల్ సీన్స్ లోను, క్లైమాక్స్ లో ఈమె స్క్రీన్ ప్రెజెన్స్ చాల బాగుంది. ఇక మిగిలిన నటీనటులంతా తమ పాత్ర మేరకు బాగానే చేశారు.

Click Here for Manasuku Nachindi Movie Review


సాంకేతిక విభాగం :
దర్శకుడిగా విద్యాసాగర్ దాదాపు సఫలమయ్యాడే చెప్పొచ్చు. ముఖ్యంగా మంచి టేకింగ్ తో థ్రిల్లర్ ని తలపించేలా తెరకెక్కించాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ అందంగా ఉండి..మంచి పొయెటిక్ థ్రిల్లర్ ను చూస్తున్నామనే భావన కలిగేలా ఉంది. షాన్ రెహమాన్ అందించిన సంగీతం గురించి మాట్లాడుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి. దుహారా మూవీస్ వారు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :
రచయిత, స్వచ్ఛమైన ప్రేమకథతో రచయితలోని లోతైన భావాల నుంచి ఓ అమ్మాయి జీవితాన్ని ఆవిష్కరించిన మంచి సినిమా. థ్రిల్లర్ సినిమాలను, కవితాంత్మక సినిమాలను ఇష్టపడే వారి పర్ఫెక్ట్ సినిమా.

  • Direction / దర్శకత్వం
  • Performances / పెర్ఫార్మన్స్
  • ScreenPlay / స్క్రీన్ ప్లే
  • Music / సంగీతం
  • Visual Appeal /విజువల్స్
2.8

Summary

దర్శకుడిగా విద్యాసాగర్ దాదాపు సఫలమయ్యాడే చెప్పొచ్చు. ముఖ్యంగా మంచి టేకింగ్ తో థ్రిల్లర్ ని తలపించేలా తెరకెక్కించాడు.

Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=dLsTLBW7wjE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here