అ! మూవీ రివ్యూ

అ! మూవీ రివ్యూ,Awe Movie public Response, Awe Movie public talk, Awe Movie Rating, Awe Movie Review, Awe Movie Review and rating, Awe Movie Updates, Awe review, Awe telugu movie review, kajal Awe review, nani Awe Movie Review, nani first production Movie Awe response, Telugu Filmnagar, Telugu Movie rating 2018, Tollywood Cinema Updates
Awe Movie Review & Rating

అ! మూవీ రివ్యూ

సినిమా : అ!
నటీనటులు : కాజల్ అగర్వాల్, రెజీనా కాసాండ్రా, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ, నిత్యా మీనన్, ప్రియదర్శి
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
సంగీతం : మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత : నాని, ప్రశాంతి త్రిపురనేని
బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా

కథ : మనుషులన్నాక రకరకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు సహజమే. అలా రాధ ( ఈషా రెబ్బ ), క్రిష్ (నిత్యా మీనన్), శివ (శ్రీనివాస్ అవసరాల), మీర (రెజినా), నలభీమ (ప్రియదర్శి) ఇలా ఎవరికివారు తమ వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ..బిజీ బిజీగా తమ జీవితాలను గడుపుతుంటారు. ఇలా వీరందరి మధ్యలోకి కాలి (కాజల్ అగర్వాల్) అనే అమ్మాయి అందరికన్నా తీవ్రమైన సమస్యతో బాధపడుతూ, దీని నుండి విముక్తి పొందాలనే నెపంతో మర్డర్స్ చేయాలనుకుంటుంది. అసలు వీరందరికి సంబంధం ఏమిటి ? చివరకి కాలి ఎవరిని హతమార్చాలనుకుంది ? చివరకి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : దర్శకుడు ప్రశాంత్ వర్మ, సినిమా ఆరంభం నుండే ఒక్కో పాత్రను ప్రేక్షకుడికి పరిచయం చేస్తూ వారి జీవితాలు ఏంటని పర్ఫెక్ట్ గా ఓ ఐడియాను ఇచ్చేశాడు. ఇక మెల్లగా కథలోకి వెళ్తూ ఒక్కో పాత్ర ప్రాముఖ్యతను వివరించడం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కాజల్, రెజీనాల పాత్రలు చాల సీరియస్ మోడ్ లో నడిపిస్తునే, మురళి శర్మ, ప్రియదర్శిల మధ్య వచ్చే సంభాషణల మూలాన ప్రేక్షకుడికి కాస్త నవ్వులు పూయించారు. అవసరాల శ్రీనివాస్ పాత్ర చాలా కన్ఫ్యూజన్ గాను నడుస్తుంది. చేప (నాని), బోన్సాయ్ చెట్టు (రవి తేజ)ల మధ్య మాట్లాడు బాగున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చే సరికి సోషల్ ఎలెమెంట్స్, హర్రర్ ఎలెమెంట్స్ తో అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక క్లైమాక్స్ మాత్రం బ్రిలియంట్ గా ఆరంభం నుంచి ఉన్న ప్రతి సన్నివేశాన్ని కలిపి, మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఈ క్లైమాక్స్ అర్థమైతే ప్రశాంత్ వర్మకు హాట్స్ చెప్పకమానరు.

నటీనటుల పనితీరు : నిత్యా మీనన్, ఈషా రెబ్బ, కాజల్ అగర్వాల్, రెజినా, అవసరాల శ్రీనివాస్ లు బాగా నటించారు. నాని, రవి తేజల వాయిస్ ఓవర్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరికీ ఇచ్చిన పాత్రలను వారు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు.

సాంకేతిక విభాగం :
దర్శకుడిగా ప్రశాంత్ వర్మ దాదాపు సఫలమయ్యాడనే చెప్పాలి. ఇలాంటి మల్టీ థ్రెడెడ్ స్టోరీతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అద్భుతమైన అవుట్ ఫుట్ ఇచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఇంటెన్స్ గా చూపించింది. మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో నిర్మాత నాని అందించిన ప్రోత్సాహం స్క్రీన్ కనిపిస్తుంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : అ!, సాధారణమైన కథకు అద్భుతమైన స్క్రీన్ ప్లే, సీన్స్ తో మ్యాజిక్ చేసి రొటీన్ సినిమాలకు భిన్నంగా తీసిన అద్భుతమైన చిత్రం. కొత్తదనం కోరుకునే వారికి తప్పకుండా నచ్చుతుంది.

  • Direction / దర్శకత్వం
  • Performances / పెర్ఫార్మన్స్
  • ScreenPlay / స్క్రీన్ ప్లే
  • Music / సంగీతం
  • Visual Appeal /విజువల్స్
3.9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here