తమిళ హీరో దర్శకత్వంలో నాగార్జున సినిమా ?

తమిళ హీరో దర్శకత్వంలో నాగార్జున సినిమా,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2018,Tollywood Cinema News,Nagarjuna To Act In Tamil Hero Direction,Akkineni Nagarjuna Latest News,King Nagarjuna Next Film Updates

తమిళ హీరో ధనుష్ మల్టీ టాలెంట్ ఉన్న సినీజనాల్లో ఒక్కరు. ఆయన గతేడాది పా పాండి సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రాజెక్టుతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. క్రిటిక్స్ చేత కూడా మంచి మార్కులే వేయించుకున్నాడు. త్వరలోనే ఈ దర్శకుడు తన రెండో సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ తేండాల్ ఫిలిమ్స్ బ్యానర్ పై చేయనున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో మన అక్కినేని నాగార్జున కూడా నటిస్తారని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరికీ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు హీరో పాత్రలో ధనుష్ కనిపిస్తాడని, కీ రోల్లో నాగార్జున కనిపించే అవకాశం ఉందని వినికిడి. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తారని తమిళ సినీ వర్గాల సమాచారం. మరోవైపు ధనుష్ ప్రస్తుతం మారి 2 సినిమా షూటింగ్ లో ఉండగా, ఇటు నాగార్జున కూడా రామ్ గోపాల్ వర్మతో ఓ పవర్ ఫుల్ పోలీస్ డ్రామా చేస్తున్నాడు. మరి ఈ కొత్త ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు త్వరలోనే వస్తాయేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here